Home తాజా వార్తలు రాజస్థాన్ పై గెలిచిన ఢిల్లీ

రాజస్థాన్ పై గెలిచిన ఢిల్లీ

అబుధాబి: ఐపిఎల్‌ 14 రెండోసీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిని చవిచూసింది. ఆర్‌ఆర్‌పై డిసి 33 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 154 పరుగులు చేయగా ఆర్ ఆర్ 121 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కెప్టెన్ సంజూ శామ్సన్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడికి మిగితా బ్యాట్స్‌మెన్లు నుంచి సహకారం లేకపోవడంతో ఆ జట్టు ఓడిపోయింది. ఆర్‌ఆర్ టీమ్‌లో సంజూ శామ్సన్ (70), మహిపాల్ లామ్రోర్ (19) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్‌ఆర్ బౌలర్లలో నోర్ట్జ్ రెండు వికెట్లు పడగొట్టగా అవీష్ ఖాన్, రవీచంద్రన్ అశ్విన్, రబడా, అక్షర్ పటేల్ తలో ఒక వికెట్ తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శ్రేయస్ అయ్యర్ 43 పరుగులు చేయడంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.