Friday, March 29, 2024

రాజకీయ లబ్ధి కోసం బిజెపి ఆ ఘటనను వాడుకుంటోంది: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: బిజెపి నాయకులు షాహిన్ బాగ్ కాల్పులతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌పై బిజెపి నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బిజెపిపై కేజ్రీవాల్ పలు ప్రశ్నలు సంధించారు. షాహిన్ బాగ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆప్ పార్టీకి చెందిన కార్యకర్త కాదని తెలిపారు. సదరు వ్యక్తి ఆప్ పార్టీ కార్యకర్త అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఢిల్లీ ఎన్నికలలో బిజెపి నాయకులు ప్రచారంలో ఏం చెప్పాలో అర్థం కాక… కేవలం షాహిన్ బాగ్ ఘటన పేరుతో రాజకీయంగా పబ్బం గడపాలని బిజెపి నేతలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. బిజెపి చేసిన చెత్త రాజకీయాలతో ఢిల్లీ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని వివరించారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనకారులు బీభత్సం సృష్టించినప్పుడు ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. షాహిన్ బాగ్‌లో రోడ్లు క్లియరెన్స్ గురించి హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసిన కూడా ఆయన స్పందించలేదని మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలను షాహిన్ బాగ్ అల్లర్ల వైపు మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతల ఆరోపిస్తున్నట్టు తాను ఉగ్రవాదినైతే బిజెపికే ఓట్లు వేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, విద్యుత్, వాటర్, రేషన్ అందించిన ప్రభుత్వానికే ఢిల్లీ ప్రజలు ఓటు వేస్తారని కేజ్రీవాల్ ధీమావ్యక్తం చేశారు.

 

Deli People Punishment to BJP in Assembly Elections

 

BJP Benefitting most for Shaheen Bagh agitation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News