Wednesday, April 24, 2024

దేశంలో కొత్త కరోనా కేసుల్లో డెల్టాదే ఆధిపత్యం

- Advertisement -
- Advertisement -

delta new corona cases in india

ప్రభుత్వ కన్సార్టియమ్ (ఐఎన్‌ఎస్‌ఎసిఒజి ) వెల్లడి

న్యూఢిల్లీ : దేశం లోని వివిధ ప్రాంతాల్లో నమోదౌతున్న కొత్త కరోనా కేసుల్లో డెల్టా వేరియంట్ ఆధిపత్యమే కనిపిస్తోందని మిగతా వేరియంట్ల ప్రభావం అంతగా లేదని కరోనా జన్యువిశ్లేషణతో సంబంధం ఉన్న ప్రభుత్వ కన్సార్టియమ్ వెల్లడించింది. డెల్టా కన్నా మరే కొత్త వేరియంట్ ప్రమేయం ఉన్నట్టు దాఖలాలు కనిపించలేదని పేర్కొంది. భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఆగ్నేయాసియా మొత్తం కొత్త కేసుల్లో డెల్టా వేరియంటే ఆధిపత్యం చూపిస్తోందని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కరోనా బారిన పడుతున్న వారిలో కూడా డెల్టా వేరియంట్ ప్రభావమే కనిపిస్తోందని ఐసిఎంఆర్ అధ్యయనం చెప్పింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్‌తో 9.6 శాతం కేసుల్లోనే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. మరణాల రేటు కేవలం 0.4 శాతానికే పరిమితమైందని అధ్యయనం వెల్లడించింది.

దేశంలో లాంబ్డా కేసులు లేవు

డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువ గానే ఉన్నా దేశంలో ఇంతవరకు లాంబ్డా వేరియంట్ కేసులు మాత్రం లేవని కన్సార్టియం వెల్లడించింది. బ్రిటన్ నుంచి వెలువడిన డేటా ప్రకారం డెల్టా తోపోల్చుకుంటే ప్రయాణికుల్లో మాత్రం స్వల్పంగా లాంబ్డా కేసులు కనిపిస్తున్నాయి. భారత్‌లో కరోనా వేరియంట్ల తీరు, మార్పులను గుర్తించడానికి సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియం ఏర్పాటైంది. కేంద్ర ఆరోగ్యశాఖ నేతృత్వంలో 28 జాతీయ ల్యాబ్‌లో ఈ కన్సార్టియమ్‌ను ఏర్పాటు చేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News