Thursday, April 25, 2024

‘డెల్టా’ దేనికీ లొంగదు!

- Advertisement -
- Advertisement -

Delta Variant Can Infect Despite Covishield Covaxin Doses

ఎయిమ్స్, ఎన్‌సిడిసి అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ :గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో బయటపడిన కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వ్యాప్తి కారకమని, ప్రజలు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాల డోసులు ఏవేసుకున్నా ఆ వేరియంట్ ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటుందని ఎఐఐఎంఎస్ (ఢిల్లీ), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) ప్రత్యేక అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌లో మొదట బయటపడిన ఆల్ఫా వేరియంట్ కన్నా డెల్టా వేరియంట్ 40 నుంచి 60 శాతం అత్యంత ప్రభావం కలిగినదని, భారత్‌లోని ఎక్కువ ఇన్‌ఫెక్షన్ల వెనుక దీని ప్రభావం ఉందని ఎఐఐఎంఎస్ వెల్లడించింది. ఐదు నుంచి ఏడు రోజులుగా తీవ్రమైన జ్వరం కొనసాగి ఎమర్జెన్సీ వార్డులో చేరిన కరోనా లక్షణాలు కలిగిన 63 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ 63 మందిలో 53 మందికి కనీసం కొవాగ్జిన్ ఒక డోసైనా ఇచ్చేలా చూశారు. మిగతా వారికి కొవిషీల్డ్ డోసు ఇచ్చారు. 36 మంది రెండు టీకాల డోసులను తీసుకున్నారు. సింగిల్ డోసు తీసుకున్న వారిలో 76.9 శాతం మంది డెల్టా వేరియంట్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని, రెండు టీకాల డోసులు తీసుకున్న 60 శాతం మంది కూడా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని తేలింది.

ఇన్‌ఫెక్షన్ 70.3 శాతం ఉన్న 27 మంది రోగుల్లో డెల్టా వేరియంట్ ప్రభావమే కనిపించినట్టు అధ్యయనంలో బయటపడింది. ఈ రెండు అధ్యయనాలూ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఆల్ఫా వేరియంట్ కూడా ప్రతిఘటిస్తున్నట్టు వెల్లడించాయి. డెల్టా, ఆల్ఫా వేరియంట్ల నుంచి వ్యాక్సిన్ల వల్ల కలిగే రక్షణ చాలా తక్కువగా ఉండవచ్చని అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే ఎఐఐఎంఎస్ ఐజిఐబి అధ్యయనాలు పుణె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఐసిఎంఆర్, కొవాగ్జిన్ ఉత్పత్తి సంస్థ భారత్ బయోటెక్ సంయుక్త అధ్యయనానికి విరుధ్ధంగా ఉన్నాయి. అయితే ఈ రెండు అధ్యయనాలు ఇంతవరకు సమగ్రంగా ఇతర అధ్యయనాలతో పోల్చి సమతూకంగా నిర్వహించ లేదని గుర్తుంచుకోవాలి అయినా డెల్టా, బీటా వేరియంట్ల నుంచి కొవాగ్జిన్ రక్షణ కల్పిస్తుందని ఈ అధ్యయనం చెప్పడం గమనార్హం. బీటా వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. గత వారం ఎన్‌సిడిసి శాస్త్రవేత్తలు , ఇండియన్ సార్స్ కొవి 2 జినోమిక్ కన్సార్టియా తమ అధ్యయనంలో భారత్‌లో సెకండ్ వేవ్ ఉధృతి వెనుక డెల్టా వేరియంట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. మే మొదట్లో భారత్‌లో ప్రతిరోజూ నాలుగు లక్షలకు మించి కేసులు నమోదవుతుండేవి.

డెల్టా వేరియంట్‌పై అమెరికా అందోళన

డెల్టా వేరియంట్ అమెరికాలో కూడా వ్యాప్తి చెందుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆందోనీపాసీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజలారా .. ఈ డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని, బ్రిటన్‌లో 1220 ఏళ్ల వయసు వారిలో వేగంగా వ్యాపిస్తోందని, మీరు ఆ వయసు వారై… వ్యాక్సిన్ ఇంకా తీసుకోకుంటే త్వరపడండి అని ప్రజలను వారు కోరుతున్నారు. మనల్ని, మనల్ని ప్రేమించే వారిని రక్షించుకోడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని బైడెన్ ట్వీట్ చేశారు. ఆంధోనీ పాసీ కూడా అమెరికాలో నమోదౌతున్న కొత్త కేసుల్లో ఆరుశాతం డెల్టా వేరియంటేనని చెప్పారు. బ్రిటన్ వేరియంట్ అల్పా కన్నా ఇది చాలా ప్రమాదకరంగా మారుతోందని, బ్రిటన్‌లో నమోదౌతున్న తాజా కేసుల్లో 60 శాతం ఈ వేరియంట్‌వేనని ఫౌసీ ఆందోళన వెలిబుచ్చారు. బ్రిటన్‌లో జరుగుతున్నట్టు అమెరికాలో జరగనివ్వం అని మీడియా సమావేశంలో పాసీ వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News