Friday, April 19, 2024

టీకాలు వేసుకోని వారిలో డెల్టా వైరస్ వేగంగా వ్యాప్తి: డబ్ల్యుహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

Delta virus spread rapidly in unvaccinated people: WHO

85 దేశాల్లో విస్తరించిన డెల్టా,
ఆప్రికా దేశాల్లో 40 శాతం పెరిగిన మరణాలు
పేద దేశాలకు టీకా అందించాలని అభ్యర్థన

జెనీవా : కరోనా రకాల్లో డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని, టీకాలు వేసుకోని వారే దీని బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ ఆందోళన వెలిబుచ్చారు. కనీసం 85 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయని, ఇటీవల చాలా దేశాలు కరోనా నిబంధనలను సడలిస్తూ వస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కేసులు పెరగడం ప్రారంభమైందని ఆయన అన్నారు. కరోనా వైరస్ మరింత రూపాంతరం చెందే ప్రమాదం ఉందని కరోనా వైరస్‌ను నిరోధించడం తోనే కొత్త వేరియంట్లు పుట్టుకు రాకుండా నిరోధించ వచ్చని ఆయన చెప్పారు. వ్యాక్సినేట్ అయిన సంపన్న దేశాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని, కొవిడ్‌తో రిస్కు లేనటువంటి యువతకు కూడా టీకాలు ఆ దేశాలు ఇస్తున్నాయని , కానీ అతి పేద దేశాలకు ఇంకా ఇంకా టీకాలు అందడం లేదని పేర్కొన్నారు. పేద దేశాలకు కరోనా టీకాలు అందివ్వాలని ఆయన కోరారు. టీకాల పంపిణీలో ప్రపంచ వ్యాప్తంగా విఫలమైనట్టు చెప్పారు.

ఆఫ్రికాలో పరిస్థితి దారుణంగా ఉందని, గతవారంతో పోలిస్తే ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్లు, మరణాలు 40 శాతం పెరిగాయని, తెలిపారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన అతి పేద దేశాలకు టీకాలు అందివ్వడంలో కొన్ని దేశాలు విఫలమైనట్టు ఆరోపించారు. అయితే ఏయే దేశాలు నిర్లిప్తంగా ఉన్నాయో ఆయన వెల్లడించలేదు. ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఆల్ఫా వేరియంట్ తరువాత డెల్టానే ప్రమాదకరమని డబ్లుహెచ్‌వొ కొవిడ్ 19 టెక్నికల్ హెచ్ డాక్టర్ మరియా వాన్ పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో టీకా పంపిణీ వేగంగా సాగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ టీకాలు అందలేదని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా అవుతోంది.అయితే భారత్ నుంనచి వ్యాక్సిన్ల సరఫరా నిలిపివేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆస్ట్రాజెనెకా, సీరం, జాన్సన్ అండ్ జాన్సన్, కంపినీల నుంచి ఈ నెలలో ఒక్కడోసు కూడా అందలేదని డబ్లుహెచ్‌ఒ సీనియర్ అడ్వైజర్ బ్రూస్ అల్‌వార్డ్ తెలిపారు.

రెండు డోసులు వేసుకున్నా మాస్క్‌లు తప్పనిసరి

వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కేవలం టీకా మాత్రమే కరోనాను నిరోధించలేదని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరింది. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా మరేం ఫరవాలేదని ధీమా పడరాదని హెచ్చరించింది. టీకా వేసుకున్నా సమూహ వ్యాప్తికి అవకాశం ఉందని, ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News