Wednesday, February 8, 2023

కోట్ల మందికి అందని ఇన్సులిన్

- Advertisement -

diabetes

లండన్ : ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగుల కోసం ఇన్సులిన్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కొన్ని కోట్ల మందికి ఇన్సులిన్ అందుబాటు కావడం లేదు. అందుబాటు మార్గాలు మెరుగైతే కానీ ఈ సమస్య పరిష్కారం కాదని కొత్త అధ్యయనం వెల్లడించింది. డయాబెటిస్ నిశ్శబ్ద హంతకి. దీనివల్ల అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం, గుండె వ్యాధుల సమస్యలు నరాల బాధలు, అంగవైకల్యం తదితర తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. పాశ్చాత్య, నగర జీవన విధానాల వల్ల శారీరక శ్రమ తగ్గి ఊబకాయం పెరిగి టైప్2 డయాబెటిస్ విస్తరిస్తోంది. టైప్ 2 డయాబెటిస్‌ను సమర్ధవంతంగా నయం చేయాలంటే ఇన్సులిన్ చాలా అవసరం. మరో 12 ఏళ్లకు ప్రస్తుత అవసరాల కన్నా 20 శాతం ఎక్కువ అవసరమవుతుంది.

కానీ 2030 నాటికి 79 మిలియన్ టైప్2 డయాబెటిస్ రోగుల్లో సగం మందికైనా ఇన్సులిన్ అందే అవకాశం కనిపించడం లేదు. ఈ తీవ్ర కొరత ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటోంది. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సంజయ్‌బసు ఆధ్వర్యం లోని పరిశోధక బృందం బ్లడ్‌సుగర్ రోగులకు కావలసిన ఇన్సులిన్ అందాలంటే ప్రస్తుత స్థాయి కన్నా ఏడు రెట్లు సరఫరా పెరగాలని అంచనా వేసింది. ఈ అంచనాలు ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికాలో తీవ్ర కొరత పీడిస్తోంది. అంటువ్యాధులు కాని ప్రమాదకరవ్యాధులను నయం చేయడానికి తగిన సహాయం చేస్తామని, ప్రపంచ దేశాలన్నిటికీ కావలసిన మందులు అందేలా ఏర్పాట్లు చేస్తామని ఐక్యరాజ్య సమితి కట్టుబడి ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇన్సులిన్ కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇన్సులిన్ సరఫరాలో నోవోనార్డిస్క్,శానోఫి, ఎలిలిల్లీ అనే మూడు సంస్థలు ఆధిపత్యం వహిస్తున్నాయి. అవి తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి.

అయినా ఇన్సులిన్ డిమాండ్ మాత్రం తీరడం లేదు. పైగా వీటి ధర సామాన్యులకు, పేదలకు అందుబాటులో లేక దళారీల వల్ల మరింత కృత్రిమ కొరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిశోధక బృందం ఇన్సులిన్ వినియోగంపై అంచనా వేసింది. 2018 నాటికి 536 మిలియన్ వయల్స్ అందుబాటులో ఉండగా 2030 నాటికి 630 మిలియన్ 1000 యూనిట్ వయల్స్ అవసరమవుతాయని అంచనా వేసింది.

Demand for Diabetes Patients Insulin

telangana latest news

సైన్స్ విభాగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles