Thursday, March 28, 2024

ఒక్కరోజు వచ్చిపోతే రూ. 15వేలు

- Advertisement -
- Advertisement -
Demand for inspections for engineering professors
ఇంజినీరింగ్ ప్రొఫెసర్లకు తనిఖీల గిరాకీ

మనతెలంగాణ/ హైదరాబాద్: మీరు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇరత సాంకేతిక కళాశాల అధ్యాపకులా… అయితే ఒక్క రోజు కనిపిస్తే రూ. 15 వేలు సంపాదించే అవకాశం. కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తే కాదు, ఒక్కరోజు కనిపించినందుకే ఈ మొత్తం మీ సొంతం అంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు సాంకేతిక కళాశాలల అధ్యాపకులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తు తం ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర సాంకేతిక విద్యా కళాశాలల్లో జెఎన్‌టియుహెచ్ తనిఖీల పర్వం కొనసాగుతోంది. అఖిల భారత సాం కేతిక విద్యామండలి(ఎఐసిటిఇ ) నిబంధనలకు అనుగుణంగా తగిన సంఖ్య లో అధ్యాపకులు లేని కళాశాలలకు గుర్తింపు గండం పొం చి ఉంది.

దీంతో ఆ గండం నుంచి గట్టెక్కేందుకు ఒక్కరోజు అద్దె అధ్యాపకుల కోసం పలు కాలేజీల యూజమాన్యాలు అన్వేషిస్తున్నారు. ఇందుకో సం కొన్ని కన్సల్టెన్సీలు కూడా పనిచేస్తున్నాయి. కరోనా కారణంగా బయోమెట్రిక్ హాజరు తొలగించడంతో ఈ వెసులుబాటును యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. చాలా కళాశాలలు అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేక ఉద్యోగాల నుంచి తొలగించడంతో చాలామంది అధ్యాపకులు కొంతకాలంగా పనిలేక ఖాళీగా ఉంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి న యాజమాన్యాలు జెఎన్‌టియుహెచ్ తనిఖీల కోసం తాత్కాలికంగా ఒక్కరోజు కోసం అద్దెకు అధ్యాపకులను తీసుకుంటున్నారు. కళాశాలలకు గుర్తింపు లభించిన తర్వాత వారికి రిలీవింగ్ లెటర్ ఇస్తామని చెబుతున్నారు.

కట్టుదిట్టంగా తనిఖీలు..

జెఎన్‌టియుహెచ్‌కు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు వర్సిటీ అధికారులు వెళ్లి తని ఖీలు నిర్వహించి, నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉంటేనే గుర్తింపు జారీ చేస్తారు. డూప్లికేట్ అధ్యాపకుల ను గుర్తించడానికి ప్రతి అధ్యాపకుడి సర్టిఫికెట్‌లతోపాటు అధార్ నంబర్, పాన్‌నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలతో పాటు కళాశాల ల్యాబ్‌లోని పరికరాలు, మౌలిక సదు పాయాలు, ఇతరత్రా విషయాలన్నింటినీ పరిశీలిస్తారు. సంబంధిత కళాశాలలు అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకా రం వర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. ఎక్కడై నా ఆప్‌లోడ్ చేసిన వాటిలో తేడాలు గుర్తిస్తే కేసులు నమో దు చేసే అవకాశంకూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలలన్నీ పాత వే కాబట్టి ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరోనా కారణంగా చాలా కళాశాలల్లో పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేరు కాబట్టి, వారిని తనిఖీల కోసం ఒక్క రోజుకు ఎంగేజ్ చేసుకుంటున్నారు. ఇందుకోసం అర్హులైన అధ్యాపకులకు రోజు కు రూ.15 వేలు చెల్లించేందుకు యాజమాన్యాలు ఆఫ ర్లు ప్రకటిస్తున్నాయి. ఇందుకు సిద్ధపడితే యాజమాన్యాలు చెప్పిన రోజున అధ్యాపకులు పనిచేసిన పాత కాలేజీ నుంచి రిలీవింగ్ లెటర్, ఎస్‌సిఎం(స్టాఫ్ సెలక్ష న్ కమిటీ మినట్స్), సర్టిఫికెట్లు తమ వెంట తీసుకురావాలని చెబుతున్నారు.

నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి : ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర సాంకేతిక విద్యలో నాణ్యత కావాలంటే అర్హులైన బోధనా సిబ్బందికి తగ్గట్టుగా బోధనేతర సిబ్బంది కూడా ఉండాలి. నిబంధనల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి విభాగానికి సరిపడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఉండాలి. రికార్డుల్లో మాత్రం నిర్ణీత సంఖ్యలో అధ్యాపకులున్నట్లుగా చూపుతున్నప్పటికీ… తనిఖీల సమయంలో మినహా సాధారణ రోజు ల్లో వాళ్లెవరూ కనిపించని పరిస్థితి. ప్రస్తుతం నిబంధన ల ప్రకారం ఒక కళాశాలలో ఉన్న అధ్యాపకుడిని ఇంకో కళాశాలలో చూపించే అవకాశం లేకపోవడంతో తనిఖీలంటే యూజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారుు. కొన్ని కళాశాలలు దీనికోసం గుర్తింపు దరఖాస్తు చేయ డం కంటే ముందు నుంచే కావాల్సిన అధ్యాపకులును వెతుక్కొని పెట్టుకుంటున్నారు. తనిఖీల సమయంలో వర్సిటీ అధికారులు కళాశాలకు వచ్చినప్పుడు వారికి ఆ ఒక్క రోజు రూ.15 వేలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ఇది కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాత్ర మే. ప్రొఫెసర్లకు దాదాపు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News