Home ఆదిలాబాద్ కొత్త జిల్లాపై పెరుగుతున్న డిమాండ్

కొత్త జిల్లాపై పెరుగుతున్న డిమాండ్

బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లలో ఒక్కటవుతున్న సంఘాలు
మంచిర్యాలలో వేడెక్కుతున్న రాజకీయం

adilabad2మంచిర్యాల: కొత్తగా మంచిర్యాల జిల్లా ఏర్పడుతుందని ప్రకటన వచ్చిందోలేదో జిల్లా కేంద్రంపై వాదనలు మొదలయ్యాయి. మంచిర్యాలను జిల్లా కేంద్రంగా చేస్తానని వాదణలు ఒక వైపు వినబడుతుండగానే తమ ప్రాంతాలకు సైతం జిల్లా కేంద్రంగా అయ్యే అర్హతలు ఉన్నాయంటూ ఆసిఫాబాద్, బెల్లంపల్లి వాసులు తమ తమ వాదlలతో ముందుకు వస్తున్నారు.
ఎవరి వాదనలు వారివే
జిల్లా కేంద్రంగా తమ ప్రాంతాన్నే ఎంపిక చేయాలని కోరుతూ బెల్లంపల్లి, ఆసిఫాబాద్ వాసులు తమ తమ వాదlలతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకుసాగుతున్నారు. నైజాం కాలంలో తమ ప్రాంతమే జిల్లా కేంద్రంగా ఉండేదని, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఆసిఫాబాద్‌నే జిల్లా కేంద్రంగా చేయాలని అక్కడి వాసులు కోరుతున్నారు. మరోవైపు రాజకీయంగాను వ్యాపార పరంగాను తమ ప్రాంతమే కొత్తగా ఏర్పడబోయే జిల్లా కేంద్రానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని బెల్లంపల్లి వాసులు తమ వాదlలు వినిపిస్తున్నారు. కొత్త ఏర్పడే జిల్లా కేంద్రం విషయంలో మంచిర్యాల, బెల్లంపల్లిలు సింగరేణి బొగ్గు ఉత్పత్తితో సంబంధం ఉండడం, రైల్వే లైన్లతో పాటు అన్ని విధాలుగా వాణిజ్య పరంగా ముందంజలో ఉండడంతో ఆసిఫాబాద్ వాసులు మాత్రం గతంలో నైజాం కాలం నాటి అనుకూలతను తెర మీదికి తెస్తున్నారు.
ఒక్కటవుతున్న సంఘాలు
కొత్తగా ఏర్పడబోయే జిల్లా విషయంలో తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో అన్ని సంఘాలను కలుపుకొని, పోరాటం చేసే యోచనలు డిమాండ్లు ఉన్న ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ఇలా అన్ని వర్గాలతో కలసి తెలంగాణ కోసం పోరాడిన తీరులోనే తమ పో రాటాలను సాగించేందుకు ఆయా వర్గాలు సంసిద్దమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం అధ్యాయనం చేసేందుకు కమిటీల పర్యటన నేపథ్యంలో ఈ కొత్త జెఎసీలు తమ వాదనలు వినిపించేందుకు సంసిద్దులు కాగా ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు ప్రాంతాన్ని కలిపి ఏర్పాటు చేసే జిల్లా విషయంలో మూడు ప్రాంతాల మధ్య పీఠ ముడి పడనుందని చెప్పవచ్చు.