Thursday, April 25, 2024

తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ ఉంది : నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Demand To Telangana Cotton : Minister Niranjan Reddyహైదరాబాద్: తెలంగాణలో పండే పత్తికి ప్రపంచ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, రాబోయే రోజుల్లో 20లక్షల ఎకరారల్లో కంది సాగు చేస్తే మేలు జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేరుశనగ పంట సాగు విస్తీర్ణం పెరగాలని నిరంజన్ రెడ్డి చెప్పారు. విత్తనాల లభ్యతకు ఎలాంటి కొరత లేదని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 65 లక్షల మెట్రిక్ ధాన్యం నిల్వల సామర్థ్యంతో గోదాములు ఉన్నాయని, భవిష్యత్ లో జిల్లా కేంద్రాల్లో గోదాములను నిర్మిస్తామని. రైతులకు బాసటగా ఉండాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. సాగు పద్దతుల్లో గణనీయమైన మార్పులు రావాలని, ఒకరిని చూసి ఒకరు వరి సాగు చేయకపోవడం మంచిందని ఆయన చెప్పారు. వరి సన్నరకాలే సాగుచేయాలని ఆయన రైతులకు సూచించారు. వానాకాంలో పత్తి, కంది సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. యాసంగిలో 52,79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, కోటీ 32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని మంత్రి తెలిపారు. ఎఫ్ సిఐ 80లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తోందని,  మిల్లర్లు 20లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారని, విత్తనాల కంపెనీలు 10 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాయని ఆయన వెల్లడించారు. తేమశాతం, తాలు నిబంధనలకు లోబడి ధాన్యం తేవాలన్నారు. పత్తి సాగు విస్తీర్ణం 70 నుంచి 75 లక్షల ఎకరాలకు పెరగాలని మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News