కనీస వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి పట్టణంలోని సింగరేని కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించిన గండ్ర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు ఏర్పాటు చేసిన వెయ్యి క్వాటర్సులో నివసిస్తున్న కార్మికుల కుటుంబాలు అనేక సమస్యలను ఈ సందర్భంగా గండ్ర దృష్టికి తీసుకచ్చారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ సింగరేని కుటుంబాలకు అందుబాటులో కూరగాయల సంతా ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలు విద్యను అభ్యసించడానికి అందుబాటులో పాఠశాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలోని ఇతర పాఠశాలల్లో విద్యను అభ్యసించడానికి వెల్తున్న పిల్లలకు క్వాటర్సు నుండి పాఠశాలవరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని, క్వాటర్సులో నివసిస్తున్న కార్మికుల కుటుంబాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడిననపుడు పోన్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని స్థానిక ఆసుపత్రి దగ్గరలో సెల్ టవర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, సింగరేని యాజమాన్యాన్ని కోరారు. ఇటీవల జరిగిన సింగరేని ఎన్నికల్లో కార్మికులకు కెసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. సింగరేని కార్మికుల సమస్యలు, కుటుంబాలకు మెరుగైన వసతి సౌకర్యాలు వెనువెంటనే పరిష్కరించకపోతే బాధితులతో ఆందోళన చేపట్టి ప్రభుత్వ పాలనను స్పందించేవిదంగా చేస్తామని హెచ్చరించారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన గండ్ర
భూపాలపల్లి నియోజకవర్గంలోని మెగుళ్లపల్లి మండలం రంగాపురం,ఇస్సిపేట గ్రామాల్లో వివిద కారణాలతో ఇటీవల మృతి చెందిన కంచె గౌరయ్య,మోతె కొంరమ్మ ,చిన్నింటి భీమ్‌రాంవ్ కుటుంబాలను మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించి ఓదార్చారు. గౌరయ్య,కొంరమ్మ కుటుంబాలకు 2వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.ఈకార్యక్రమంలో మొగుళ్లపల్లి,ఘనపురం మండలాల అధ్యక్షులు పోలినేని రాజేశ్వర్‌రావు. లక్ష్మినర్సింహరావు,జిల్లా కార్యదర్శి సంపెల్లి నర్సింగరావు,గండ్ర యువవసేన జిల్లానాయకలు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,నాయకులుతదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించి సౌకర్యం కల్పించాలని డిమాండ్
- Advertisement -
- Advertisement -