Home మహబూబాబాద్ దౌర్జన్యమా? ధిక్కారమా?

దౌర్జన్యమా? ధిక్కారమా?

ph

మానుకోటవాసుల చెదిరిన ‘గూడు’
అనుమతులు ఉన్నా ఇండ్లు కూల్చివేత
ఎఫ్‌టిఎల్ పేరుతో వేధింపులు
లేఅవుట్ ప్లాట్లలో కందకాలు
కాలనీవాసుల ఆందోళన

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: దౌర్జన్యమో, కోర్టు ధిక్కారమో కానీ వెరసి మానుకోటలో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఏకంగా అధికారులు ఇది ఎఫ్‌టిఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) అంటూ లేఅవుట్ ప్లాట్లకు ట్రెంచ్ కొట్టారు. అలాగే ఆ ప్రాంతంలో దశాబ్ద కాలంగా అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇండ్ల నిర్మాణాలకు నోటీసులు అందించారు. వారంలోగా మీఇల్లు మీరే తొలగించుకోండి, లేదంటే మేమే తొలగిస్తాం దాని ఖర్చు కూడా మీ నుండే వసూలు చేస్తాం. ఇదీ మానుకోట అధికారుల తీరు. మానుకోట శ్రీరాంనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వద్ది వీరన్న, బాధితులు ఘనపురపు అంజయ్య, గడ్డం అశోక్, పెనుగొండ ప్రవీణ్, తదితర బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తమకు అన్ని విధాలా ఇంటి నిర్మాణానికి తగిన కాగితాలు ఉన్నాయని అనుమతులు ఇచ్చిన మున్సిపల్ కమిషనరే మీ ఇల్లు వారంలో కూల్చేస్తామని నోటీసులు ఇవ్వడం చిత్రవిచిత్రంగా ఉందని వా రన్నారు. ఒక యజమాని ఇల్లు కట్టుకోవాలంటే ఏ విధమైన అనుమతి ప త్రాలు ఉండాలో అవ న్నీ ఉన్నాయి. ఇంటి నిర్మాణాలు పూర్త్తయ్యి పన్నులు కూడా బకా యి లేకుండా చెల్లిస్తూ నే ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రైవేటు వ్యక్తుల బలవంతమో, లేక రాజకీయ వత్తిల్లో కానీ హై కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి నా అవి అవసరం లేదని, అవసరమైతే తమపై కోర్టు ధిక్కారం క్రింద తిరిగి కోర్టుకు వెళ్ళవచ్చని ఏకంగా ఓ రెవిన్యూ అధికారే స్వయంగా బాధితులతో అనడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ఏర్పడి సుమారు 30సంవత్సరాలు అయింది. కాలనీ సమీపంలో ఠాకూర్ కిషోర్ సింగ్, కుటుంబానికి చెందిన సర్వే నెంబర్‌లు 647 నుండి 656 వరకూ 657/పి, 661/పికి చెందిన ఖాస్రా పహాణి 1954 ప్రకారం 20 ఎకరాల పట్టా భూమి ఉందని ఈ భూమిని వారు 2000 సంవత్సరంలో లేఅవుట్ చేశారని వారు తెలిపారు. లేఅవుట్ నెం. ఎల్‌పి 6/2000 ప్రకారం ఇందులో 2ఎకరాల భూమి గ్రీన్‌ల్యాండ్ క్రింద ప్రభుత్వానికి ఇవ్వడంతో అందులో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళను కూడా నిర్మించారని, అలాగే 218 ప్లాట్లు చేశారని తెలిపారు. ఆ ప్లాట్లు దశలవారీగా పలువురు అమ్మకాలు, కొనుగోలు చేశారని, ప్రభుత్వం తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసి, ఇండ్లు కట్టుకుని నివాసముంటుంటే 18 సంవతవ్సరాల తర్వాత తమ ప్లాట్లు నిజాం చెరువులో ఉన్నాయని, ఎఫ్‌టిఎల్ లో ఉన్నాయని వేధిస్తూ నోటీసులు ఇవ్వడంతో 2011లో హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మొదలు స్టే ఇచ్చిందని వారు తెలిపారు. ఆ తర్వాత 2015 సెప్టెంబర్ 30న డబ్లుపినెం. 15095 ప్రకారం హైకోర్టు తమకు అనుకూలంగా తీర్చు నిచ్చిందని వారు తెలిపారు. అందులో లేఅవుట్లకు, సర్వే నెంబర్లకు, గ౧హౠలకు, ప్లాట్లకు ఎఫ్‌టిఎల్ వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయినా మానుకోట మున్సిపల్, నీటి పారుదల శాఖ, రెవిన్యూ అధికారులు తప్పుడు నివేదికలతో తమను వేదిస్తున్నారని వారు ఆరోపించారు. అకస్మాత్తుగా గురువారం ఉదయం జెసిబిలతో అధికారులు హస్తినాపురం కాలనీకి వచ్చి లేఅవుట్ ప్లాట్లలో కందకాలు తీస్తుండగా అడ్డుకున్న వారిని పోలీసులు ప్రక్కకు తొలగించి పోలీసు బందోబస్తు మధ్య దౌర్జన్యంగా తమ గోడు వినకుండా కందకాలు తవ్వడమే కాకుండా ఉదయం నోటీసులు ఇచ్చి అందులో వారం గడువు ఇచ్చి మద్యాహ్నమే అన్ని అనుమతులు ఉన్న ప్రహారీ గోడ, విద్యుల్ లైట్లను జెసిబితో దౌర్జన్యంగా తొలగించారని టిఆర్‌ఎస్ నాయకులు ఘనపురపు అంజయ్య ఆరోపించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా ఇలా కందకాలు త్రవ్వడం సరికాదని, హైకోర్టు తీర్పు చూపించినా అధికారులు పట్టింకుకోకుండా దౌర్జన్యంగా కందకాలు త్రవ్వడం, ప్రహారీ, కళాశాల గదులు కూల్చివేయడం భావ్యం కాదని వారు ఆరోపించారు. జెసిబి ముందు బైఠాయించారు. కాలనీలో ర్యాలీ చేశారు. పోలీసులు, అధికారులతో వాగ్వివాదం చేశారు. అయినప్పటికీ అధికారులు కనికరించలేదని, తమకు ఉన్న అనుమతులను కూడా చూడలేదని తక్షణమే తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వం, ప్రజా ప్రతినిథులను వేడుకున్నారు.