Home తాజా వార్తలు అక్రమ నిర్మాణాల కూల్చివేత…!

అక్రమ నిర్మాణాల కూల్చివేత…!

Demolition of illegal structures in Gachibowli

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పరిధిలో గల గౌలిదొడ్డిలో రెవెన్యూ అధికారులు, జిహెచ్‌ఎంసి సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కేశవనగర్‌లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేశారు. అయితే, తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూలుస్తున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో ఘటనాస్థలిలో భారీగా పోలీసులు మోహరించారు.