Home ఆఫ్ బీట్ రెస్టారెంట్లలో ఫుల్లుగా మెక్కుతూ… పైసలెగ్గొడుతున్న ఫారెనర్లు…!!

రెస్టారెంట్లలో ఫుల్లుగా మెక్కుతూ… పైసలెగ్గొడుతున్న ఫారెనర్లు…!!

India Currency Chaos

ఇండియాలో ఎక్కువగా విదేశీయులు కేరళనే సందర్శిస్తుంటారు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు. మన దేశం నుంచి కూడా ఎక్కువ టూరిస్టులు కేరళకే వెళ్తుంటారు. కేరళ ప్రకృతి అందాలంటే విదేశీయులకు పిచ్చంట. అందుకే ఇండియాను సందర్శించినప్పుడు పక్కా కేరళ కు వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదించి మరీ వస్తారు.

అయితే, ఈ మధ్య కేరళ కు వచ్చిన ఫారెనర్లు… అక్కడి రెస్టారెంట్ల లో ఫుడ్ తిని డబ్బులు ఇవ్వకుండా జారుకుంటున్నారట.

రీసెంట్ గా ఓ ఫారెనర్… కేరళ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లి…. క్రెడిట్ కార్డులు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాడట. దానికి, రెస్టారెంట్ ఓనర్… లేదు అని చెప్పినా… వెళ్లి ఫుడ్ తిన్నాడట. తర్వాత తిన్నగా జారుకున్నాడట. ఇంతలో రెస్టారెంట్ సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి తీసుకొచ్చారట.

అప్పుడు ఆ ఫారెనర్ అన్న మాటలను విన్న రెస్టారెంట్ ఓనర్ షాక్ కు గురయ్యాడట. ఇంతకీ ఆ ఫారెనర్ ఏమన్నాడనేగా మీ డౌట్… అక్కడికే వస్తున్నా… తన దగ్గర క్రెడిట్ కార్డు మాత్రమే ఉందని… చేతిలో చిల్లి గవ్వ లేదని… బాగా ఆకలిగా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదని.. ఎక్కడ ఏ ఎటిఎం ను చూసినా…. డబ్బులు లేవని… అందుకే డబ్బులు ఇవ్వలేకపోయానని… ఆ ఫారెనర్ చెప్పడాట.

పరిస్థితి అర్థమయిన రెస్టారెంట్ ఓనర్… పర్లేదు.. డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వొచ్చని చెప్పి ఆ ఫారెనర్ ను పంపించాడట. అయితే, ఆ రెస్టారెంట్ ఓనర్ కు ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయట.

ఇదివరకు చాలా మంది ఫారెనర్లు వచ్చి తమ దగ్గర డబ్బులు లేవని… బాగా ఆకలిగా ఉందని చెప్పడంతో డబ్బులు తర్వాత చెల్లించమని చెప్పి… ఫుడ్ పెట్టించాడట ఆ రెస్టారెంట్ ఓనర్.

అది సంగతి…..