Home హైదరాబాద్ నగరంలో విజృంభిస్తున్న డెంగీ

నగరంలో విజృంభిస్తున్న డెంగీ

 Dengue booming in the Hyderabad city

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం, పది రోజులుగా డెంగీ బారిన పడి ఆసుపత్రులలో చేరిన బాధితుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. నగరంలో ఇప్పటికే ఈ వ్యాధిసోకి ఇద్దరు మృత్యు వాత పడ్డారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దీంతో డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేప ట్టాలంటూ వైద్యఆరోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వెంటనే దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకో వాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల సౌకర్యార్థం సదుపాయాలు కల్పించాలని సూచించింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖతో పాటు జీహెచ్‌ఎంసీ ఎంటామాలజీ డిపార్ట్ మెంట్ అధికారులు దోమల నివారణకు చర్యలు చేపట్టారు. డెంగీ భారిన పడిన రోగులు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలి..?
సాధారణంగా డెంగీ జ్వరం వచ్చిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే తగ్గిపో తుంది. కేవలం 20 శాతం మందిలో మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆసుపత్రిలో చేరిన 20 శాతం మందికి కేవలం లక్షణాలను బట్టి చికిత్సనందించడం జరుగుతుంది. వ్యాధి ముదిరిన వారిలో మాత్రమే శరీరం నుంచి అంతర్గతంగా రక్తస్రావం జరుగుతుంది. ఇలా రక్తస్రావం అవుతున్న జ్వర పీడితులకు మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించా ల్సివస్తుంది. ఆసుపత్రి లో చేరా లా? వద్దా? అనేది రోగి లక్ష ణా లను పరీక్షించి వైద్యుడు నిర్ణయి స్తాడు. రక్తపోటు తగ్గి పోయి, రోగి నీర సంగా ఉన్న ప్పుడు తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇవ్వాల్సి ఉంటుం ది. జ్వరం వచ్చి తగ్గిన మూడు, నాలుగు రోజుల తర్వాత రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గక పోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్లేట్ లెట్ల సంఖ్య ఈ రోజు లక్ష ఉన్నది కాస్తా.. రేపటికి 80వేలకు పడిపో వచ్చు. ఇలాంటి అనూహ్యమైన పరి స్థితుల్లో తప్పా.. మాములుగా అయితే 10 వేలకు పడి పోయినా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరంలేదు. అంతక ంటే తగ్గపోతే అప్పుడు వాటి అవసరం పడుతుందని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.
డెంగీతో ఇద్దరు మృత్యువాత
నగరంలో డెంగీ బారిన పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. పహడీషరీఫ్‌కు చెందిన ఎంపిటిసి సభ్యురాలు మహమద్ యాస్మీన్ బేగం తల్లి షానవాజ్ బేగం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ రెండు రోజులక్రితం మృతి చెందింది. ఆమె డెంగీ తోనే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అడ్డగుట్టకు చెందిన విఘ్నేష్ అనే పదేళ్ల బాలుడు డెంగీ బారిన పడి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతి చెందాడు. అదే బస్తీకి చెందిన కీర్తి అనే ముప్పయేళ్ల మహిళ డెంగీతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
డెంగీ సోకిన లక్షణాలు …
* తీవ్రంగా జ్వరం వస్తుంది. 104 డిగ్రీల జ్వరం రావడంతోపాటు ఆ సమ యంలో చలి వణికిస్తుంది.
* ఒళ్లు నొప్పులతో పాటు కండరాల నొప్పుల తీవ్రత అధికంగా ఉంటుంది.
* రోగి నీరసించిపోతాడు. విఫరీతంగా తలనొప్పి వస్తుంది.
* కీళ్ల నొప్పులతో పాటు వాపు కూడా ఉంటుంది.
* చర్మంపై దద్దుర్లు వచ్చి, కాస్తంత దురదగా ఉన్నట్టనిపిస్తుంది.
* ఆకలి మందగిస్తుంది. వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది.
* శోష గ్రంథులకు వాపు వస్తుంది. దీంతో గొంతు కింద, చంకల్లో నరాలు ఉబ్బినట్లు అనిపిస్తాయి.
* డెంగీవచ్చిందంటే కంటి గుడ్డు వెనక భాగం మొత్తం ఎర్రబారినట్టు ఉంటుంది.
* డెంగీ వచ్చిన వారిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య భారీగా పడిపోతుంది. సాధారణ వ్యక్తికి 3.50 లక్షల నుంచి 5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. డెంగీ బాధితుడికి 30 వేలకు పడిపోతాయి.
నివారణ చర్యలు …
* ఎడిస్ ఈజిప్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ సోకుతుంది. అందుకే దోమకాటు నుంచి తప్పించుకోవడం ముఖ్యం. దోమ తెర లను ఉపయోగించాలి. దోమలు కుట్టకుండా చర్మానికి క్రీములు రాసుకోవాలి. దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరా లను ఎప్పటికప్పుడు పరిశ్రుభంగా ఉంచుకోవాలి.
*డెంగీని నిర్ధారించేందుకు ఎలీజా టెస్ట్ మాత్రమే ఉపయో గపడుతుంది. ర్యాపిడ్ డయాగ్నిక్ టెస్ట్ పనికిరాదు.
* డెంగీ సోకిందంటే శరీరంలో నీటి శాతం భారీగా తగ్గుతుంది. అందుకే ఎక్కువగా ఐవీ ప్లూయిడ్స్ ఎక్కించుకోవాలి.
* బాధితుడి రక్తంలో 60వేల కంటే ప్లేట్‌లెట్స్ పడిపోతే ఇతరుల నుంచి తీసిన ప్లేట్ లెట్స్ ఎక్కించాలి.
* జ్వరం తగ్గగానే తిరిగి ప్లేట్‌లెట్స్ అతి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.
* డెంగీకి ప్రత్యేకమైన వైద్యంలేదు. నయమయ్యే వరకూ పారాసెటిమాల్ మాత్రలతోపాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.
* డెంగీ జ్వరం తీవ్రంగా వచ్చిన బాధితుడు సరైన చికిత్స పొందితే వారంలోగా కోలుకునే అవకాశం ఉంటుంది.
———-