Home జిల్లాలు డెంగ్యూ పంజా

డెంగ్యూ పంజా

malaria-స్పందించని వైద్యాధికారులు
డెంగ్యూతో రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు

సిటీబ్యూరో:నగరంలో డెంగ్యూ వ్యాధి పడగ విప్పి బుస కొడుతూ ప్రజల ప్రాణాలను హరిస్తుంటే దానిని నివారించాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తు న్నారు. డెంగ్యూ, మలేరియా డిఫీర్తియా లాంటి ప్రాణాంతక వ్యాధులు విజృం భించడంతో మురికివాడలతో పాటు కాలనీలు, బస్తీవాసులను నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు రోజుల క్రితం రామంతాపూర్‌లో 10 ఏళ్ల చిన్నారి డెంగ్యూతో మృత్యువాతపడగా, ఈ వ్యాధికి శుక్రవారం బోడుప్పల్ సాయి నగర్‌కు చెందిన యువ క్రికెటర్ సాయినాధ్(16) బలయ్యారు. దీంతో డెంగ్యూ వ్యాధి ఇప్పటీకే దాదాపు 10 మందికి పైగా బలిగొనగా, వందలాది మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విష జ్వరాలు ప్రబలకుండా జిల్లా చర్యలు తీసుకోవడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సహాయం, సలహాలు సూచనలు అందించాల్సి ఉండగా వైధ్యాధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తు న్నారు. విష జ్వరాలు ప్రబలుతున్న ప్రాంతాలకు వెళ్లి బాధితులను గుర్తించి వారికి వెంటనే రక్త పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రత పెరగకముందే సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో భయాందోళనలను దూరం చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జ్వరాలు సోకితే వెళ్లేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసు పత్రులున్నాయనే సాకుతో బస్తీలు, కాలనీల వైపే చూడడం మానేశారు. అయితే విష జ్వరాల బాధితులు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లితే అక్కడ నామామాత్రం మందులుఇచ్చి ఇంటికి పంపిస్తుండడతో వాటని వేసుకున్న జ్వరాల తీవ్రత తగ్గడం లేదు. దీంతో బస్తీలు, కాలనీలోని క్లినిక్‌లు, ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రి పాటు ప్రైవేట్ ఆసుపత్రులన్ని రోగుల తో కిటకిటలాడిపోతున్నాయి. అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఎవరి కి జ్వరం సోకినా వారం నుంచి 10 రోజుల పాటు తగ్గకపోగా, ఉన్నఫలంగా ప్లేట్‌లెట్స్ తగ్గుముఖం పడుతుండడంతో బాధితులు ప్రాణభయంతో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం పేరుతో అందిన కాడికి దోచుకుంటూ నగర వాసుల జేబులకు చిల్లులు పెడు తున్నారు. మరోవైపు విషజ్వరాలు అంతకు అంత విస్తరించకుండా పరిసరాల పరిశ్రుభతను చేపట్టాల్సిన జిహెచ్‌ఎంసి, తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన జలమండలి అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరి స్తున్నారు. దీంతో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మురికి కాలువలు పొంగడం, గుంతలు, లోతట్టు ప్రాంతాలతో నీరు నిల్వ ఉంటుం డడంతో దోమలు, ఈగలు మరింత వృద్ధి చెందుతుండడంతో డెంగ్యూ, మలే రియా, కలరా, స్వైన్ ప్లూ లాంటి విషజర్వాలతో నగర
వాసులు వణికి పోతు న్నారు. మరోవైపు తాగు నీరు సైతం కలుషితమై డిఫ్తిరియా లాంటి వ్యాధులు నగర వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో విష జ్వరాల బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుం డగా, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం మాత్రం వందల్లో ఉంటోంది. వైద్య అధికారులు క్ష్రేత్రస్థాయిలో దృష్టి సారించి విష జ్వరాల తీవ్రతను అంచనా వేయాల్సి ఉండగా, అది చేయ కుండా తమ దృష్టి వచ్చిన నామ మాత్రంపులెక్కలనే పరిగణలోకి తీసుకుని అంతా బాగుందని భ్రమ పడుతున్నారు. దీనికి తోడు ప్రైవే ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంతుతున్న డెంగ్యూ బాధితుల వివరాలను వెంటనే ప్రభుత్వానికి తెలుపాల్సి ఉండగా, తమకు చికిత్స పేరుతో రోచుకునే అవకాశానికి గండి పడుతుండని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కనీస వివరాలను కూడ బయటపెట్టడడం లేదు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విష జ్వరాలపై ఖచ్చితమైన అంచనా రాకపోవడంతో పాటు సకాలం స్పందించడం లేకపోతు న్నారు. పేదలు సకాలం ప్రభుత్వ వైద్యం అందకపోవడం, డబ్బులు లేక ప్రైవేట్ ఆసుపత్రుల వెళ్లలేక పోడంతో నిరుపేదలు ప్రాణాలు కొల్పొతుండగా, మధ్య తరగతి ప్రజలు ప్రాణభయంతో ప్రైవేట్ ఆసు ప్రతుల వైపు పరుగులు తీస్తుండడంతో ఆర్థికంగా చితికిపో తున్నారు.