Home రాష్ట్ర వార్తలు డెంగీ పంజా

డెంగీ పంజా

ఖమ్మం జిల్లాకు వైద్య బృందాలు

రాజధానికి సీరియస్ కేసులు: మంత్రి లకా్ష్మరెడ్డి ఆదేశాలు
నల్లగొండ జిల్లా పిట్టంపల్లి గ్రామంలో జ్వరాల స్వైరవిహారం

dengueహైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని డెంగీ బాధిత గ్రామాలకు నగరంలోని ఫీవర్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్య బృం దాన్ని పంపించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మ రెడ్డి నిర్ణయించారు. సోమవారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో లకా్ష్మరెడ్డి సమావేశమయ్యారు. డెంగీ వ్యాధి నియంత్రణలోకి వచ్చేంతవరకు అక్కడే ఉండి చర్యలు చేపట్టాలని జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభావతి, వైద్య, పారా మెడికల్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా లతో పాటు వ్యాధి తీవ్రంగా ఉన్న ఖమ్మం జిల్లా బోనకల్ తదితర గ్రామాల్లో పరిస్థితి, తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో డెంగీ వ్యాధితోపాటు ప్రత్యేకించి ఖమ్మం జిల్లా బోనకల్, రావినూతల, గోవిందపురం తదితర గ్రామాల్లో డెంగీ వ్యాధి తీవ్రం కావడానికి దారితీసిన పరిస్థితులపై ఆయన అడిగి తెలసుకున్నారు. డెంగీ బాధితులకు చికిత్స చేస్తూనే దాని నివారణకు సంపూర్ణ చర్య లు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్, రావినూతల, గోవిందపురం, ఆళ్లపాడు గ్రామాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని వెళ్లి   ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని లకా్ష్మరెడ్డి ఆదేశించారు. అవసరమైన సెల్‌కౌంట్ మిషన్స్ పరీక్షా పరికరాలను, స్ప్రేలను వెంటనే పంపించాలని మంత్రి ఆదేశించారు. వారానికి రెండు సార్లు బాధిత ఇళ్లలో స్ప్రే చేయాలని, సీరియస్‌గా ఉన్న కేసులను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి, మరింత విషమంగా ఉన్న కేసులను హైదరాబాద్‌కు వెంటనే తరలించాలని మంత్రి సూచించారు. గ్రామానికి ఒకటి చొప్పున 108 నెంబర్ వాహనాలను ఏర్పాటు చేయాలని, డెంగీ విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ఖమ్మం జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా తదితర విభాగాల అధికారుల సమన్వయంతో పారిశుధ్యం తదితర చర్యలు చేపట్టాలన్నారు. డెంగీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. జ్వరపీడితులైన ప్రజలు అనర్హులైన వైద్యుల వద్దకు వెళ్లవద్దని, అర్హులైన వైద్యుల వద్దనే చికిత్స చేయించుకోవాలని మంత్రి లకా్ష్మరెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ప్రజారోగ్య సంచాలకురాలు డాక్టర్ లలితకుమారి.అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభావతి, మలేరియా అధికారి సంజీవరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
పిట్టంపల్లిలో
కట్టంగూర్ మండల పరిధిలోని పిట్టంపల్లి గ్రామంలో ప్రజలు విషజ్వరాలు విజృంభించడంతో మృత్యువాత పడుతున్నారు. దీనికితోడు రోజురోజుకి గ్రా మంలో చిన్నాపెద్ద అనే తేడలేకుండా విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతు న్నారు. గ్రామంలో సుమారు 350కుటుంబాలు 2000 జనాభా కలిగిఉన్నా రు. గత 20 రోజులుగా జ్వరాలు సోకి, ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు చొప్పున మంచానపడుతున్నారు. ఏం జరుగుతు ందో అర్ధం కాక గ్రామస్తులు నిత్యం భయాందోళనకు గురౌతున్నారు. గ్రామ ంలోని డ్రైనేజీల్లో మట్టిపేరుకుపోయి, పిచ్చి మొక్కలు మొలవడంతో నీరుపా రక, దోమలు కుప్పలుతెప్పలుగా స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రభుత్వం అట్టహాసంగా సీజనల్ వ్యాధులు సోకుండా పారిశుద్ధ వారోత్సవాలు నిర్వ హిస్తున్నా, సంబంధిత అధికారుల నిర్లక్ష వైఖరివల్ల ఎక్కడాకూడా పరిస రాలు శుభ్రంగా ఉండడంలేదు. ప్రభుత్వం పారిశుద్ధంకోసం కోట్లాదిరూ పాయలు విడుదల చేస్తున్నా ఆచరణలో అమలుకావడంలేదు. గ్రామంలో ఉన్న మంచినీటి ఓహెచ్‌ఎస్‌ఆర్, జిఎస్‌ఎల్‌ఆర్ ట్యాంక్‌లను శుభ్రం చేయక పోవడంతో తాగునీరు కలుషితమై వ్యాధులబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి కొనసా గుతోంది
భయాందోళనలో ప్రజలు: గ్రామంలో వరుసగా విషజ్వరాలు ప్రభ లుతుం డడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని అయిటిపా ముల, కట్టంగూర్, ఈదులూర్, చెర్వుఅన్నారం, కలిమెర, మునుకుంట్ల తది తర గ్రామాల్లో ప్రజలు డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి విషజ్వరాల బారి నపడి చికిత్సపొందుతూ, కొంతమంది మృత్యువాత పడ్డారు.
వీధుల్లోనే పెంటదిబ్బలుఎస్‌కె. హాసియా, పిట్టంపల్లి గ్రామస్తురాలు
మాఇంట్లో నాతోపాటు నాకొడుకుకూడా ఆసుపత్రి పాలయ్యాడు. నేను ప్రస్తు తం జ్వరంతో బాధపడుతున్నాను. నాకొడుకును నల్లగొండలోని విఠల్‌బాబు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే 20 వేలు ఖర్చు అయి నాయి. డాక్టర్లు ఎన్నడూ మాగ్రామాన్ని పట్టించుకోవడంలేదు.
ఫాగింగ్ మిషన్‌తో దోమలమందు కొండ నర్సింహ్మ, పిట్టంపల్లి గ్రామస్తుడు
వానకాలంనుండి ఇప్పటివరకు మాగ్రామంలో ఎలాంటి పారిశుద్ధ చర్యలు చేపట్టలేదు. గ్రామంలో దోమలు విపరీతంగా ఉన్నందువల్ల పంపులో కిరోసిన్ పోసి పిచికారి చేస్తున్నారు. ఆవాసనకు పిల్లలు, వృద్ధులు తట్టుకోలేక పోతున్నారు. వెంటనే ఫాగింగ్ మిషన్‌తో దోమల నివారణ చేపట్టాలి.