Home జాతీయ వార్తలు లఖింపుర్ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగీ

లఖింపుర్ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగీ

Dengue to main accused in Lakhimpur case

లఖ్‌నవూ : లఖింపుర్ ఖేర్ హింసాత్మక సంఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగీ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రిమాండులో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయనకు మధుమేహ సమస్య కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆశిష్ మిశ్రా సహా 13 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈనెల 3 న ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడిగా ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక సంఘటనలో మరో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను గత శనివారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణకు ఆశిష్ మిశ్రా సహకరించడం లేదని పోలీసులు తెలపడంతో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఆ తరువాత పోలీసులు రిమాండ్‌కు తీసుకున్నారు.