Home తాజా వార్తలు నేడు, రేపు తేలికపాటి వర్షాలు

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

showers

 

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదివారం, 19వ తేదీన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలో మీటర్ల నుండి 4.5 కిలో మీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

పశ్చిమబెంగాల్ దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాలలో 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఎత్తుకి వెళ్ళేకొద్ది నైఋతి వైపుకు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో పశ్చిమబెంగాల్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లె తెలిపింది.

Department of Weather has forecast possibility of showers