Saturday, April 20, 2024

టిఎస్‌ఆర్‌టిసిలో డిపోల దత్తత

- Advertisement -
- Advertisement -

TSRTC

 

హైదరాబాద్: టిఎస్‌ఆర్‌టిసి సంస్థలో డిపోల వారీగా లక్ష్యాల సాధనకు ప్రతిష్టాత్మకంగా డిపోల దత్తత కార్యక్రమానికి శ్రీకారం చేశారు. ఈ మేరకు దత్తత తీసుకున్న డిపోలను స్వయంగా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, మెరుగుదలకు యాక్షన్ ప్లాన్ ఖరారు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిపోల వారీగా లక్ష్యాల సాధన, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగు పరిచేందుకు గాను సంస్థలోని ఉన్నతాధికారులు డిపోలను దత్తతను తీసుకొవాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో సంస్థను అభివృద్ధి దిశగా పయనింపజేయడానికి పలు మార్గదర్శకాలను జారీ చేశారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు డిపోల దత్తతను ప్రారంభించారు.

ఇందులో భాగంగా జహీరాబాద్ డిపోను దత్తత తీసుకున్న టిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వెంకటేశ్వర్ రావు స్వయంగా క్షేత్ర స్థాయిలో డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలను లాభాల భాటలో నడపడానికి కృషి చేయడం జరుగుతుందని స్థానిక అధికారులకు వివరించారు. డిపో ఆదాయం పెంపు కొరకు స్థానిక అధికార యంత్రాంగం నుండి ఆయన సూచనలు, సలహాలను కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ డిపోను లాభాల బాట పయనింపజేయడానికి చిత్తశుద్ధితో సూపర్ వైజర్‌లు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అనంతరం ఏడుపాయాల జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల క్యాంపును స్వయంగా పరిశీలించారు. అలాగే జహీరాబాద్ మార్గంలో అనధికారికంగా నడుస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జహీరాబాద్ బస్సు స్టాండు నుండి వివిధ మార్గాలకు బయలుదేరు బస్సుల సమాచారం, షాట్ అండ్ లోడ్ విధానం అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కండక్టర్‌ల మొక్క ఇపిబి బుక్కులను ఆయన తనిఖీ చేశారు. బస్సు స్టాండులో నూతనంగా ప్రయాణికుల సౌకర్యార్థం మహేంద్రా అండ్ మహేంద్రా కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మల మూత్రశాల సముదాయం పనులను ఆయన పరిశీలించారు. అలాగే డిపో గ్యారేజ్ సిబ్బందితో మాట్లాడారు, ఈ మేరకు గ్యారెజ్ నందు నెలకొన్న సమస్యల వివరాలను సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. బస్సుల నిర్వహణ క్రమం తప్పకుండా ప్రణాళిక బద్దంగా చేయాలని అదేశించారు. తద్వారా బస్సులు మార్గ మధ్యలో చేడిపోకుండా ప్రయాణికులకు ఉత్తమైన సౌకర్యం అందించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

Depot Adoption in TSRTC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News