Tuesday, March 21, 2023

తగ్గితే.. ఒత్తిడి…భవిష్యత్ పుత్తడి

- Advertisement -

studies

*ఛిద్రమవుతున్న చిన్నారుల మెదళ్లు
*చదువుల పరుగులో అలసిపోతున్న విద్యార్థులు
*పెద్దల తీరుతో ఒత్తిడికి గురవుతున్న పిల్లలు
*బండుల్లో బందీ ఆవుతున్న పసితనం

మన తెలంగాణ/సూర్యాపేట
అటు చదువులు.. ఇటు ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన విద్యార్ధిలోకం అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. పుస్తకాలతో కుస్తీకి పరిమితమై మానసికంగా కుదేలవుతోంది. ఒత్తిడిని భరించలేక… మనస్సులో రేగుతున్న అలజడిని ఎవరితో పంచుకోవాలో అర్థంగాక బలవన్మరణాల వైపు చూస్తోంది.. కన్నవారికి కడుపుశోకాన్ని మిగులుస్తూ.. చదువుల పోటీని… ప్రభుత్వాల ఉదాసీనతను నిలదీస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కల్గిస్తున్నాయి. విజ్ఞానాన్ని, వికాసాన్ని పంచాల్సిన చదువులు భారంగా మారడంతో బలవంతంగా తనువు చాలిస్తున్నారు. అయితే విద్యావేత్తల సర్వే ప్రకారం విద్యార్థులకు ఒత్తిడి తగ్గితేనే బంగారు భవిష్యత్ ఉంటుందని తెలుపుతున్నారు. అంతే కాకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్యాభ్యాసం కొనసాగించాలంటున్నారు. మన తెలంగాణ/సూర్యాపేట: అటు చదవులు.. ఇటు ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన విద్యార్ధిలోకం అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. పుస్తకాలతో కుస్తీకి పరిమితమై మానసికంగా కుదేలవుతోంది. ఒత్తిడిని భరించలేక… మనస్సులో రేగుతున్న అలజడిని ఎవరితో పంచుకోవాలో అర్థంగాక బలవన్మరణాల వైపు చూస్తోంది.. కన్నవారికి కడుపుశోకాన్ని మిగులుస్తూ.. చదువుల పోటీని… ప్రభుత్వాల ఉదాసీనతను నిలదీస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆం దోళన కల్గిస్తున్నాయి. విజ్ఞానాన్ని, వికాసాన్ని పంచాల్సిన చదువులు భారంగా మారడంతో బలవంతం గా తనువు చాలిస్తున్నారు. మంచి మార్కులు రాలేదని కొందరు… ఉదయం నుంచి రాత్రి వరకు బందిఖానాల్లో చదవలేక మరికొందరు.. పోటీలో వెనకబడ్డామని, ఇష్టం లేని కోర్సులో రాణించలేకపోతున్నామని.. అమ్మానాన్న కోరుకున్నట్లుగా చదవలేకపోతున్నామని ఇంకొందరు ఇలా ఇటీవల పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు తీసుకొన్నారు. ఓట మి గెలుపునకు మెట్టు అని.. ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు రాకపోయినా.. జీవితంలో రాణించేందుకు మరెన్నో కోర్సులున్నాయని భుజం తట్టే వారు లేక.. వారిలో వారే కుమిలిపోయి మరలిరాని లోకాలకు వెళ్లిపోతుండటం కలవరపెడుతోంది. ఇటీవలె జిల్లాలోని పెన్‌పహాడ్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఆత్మహత్య చేసుకోడానికి కారణమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడలేదని విద్యార్థినీని ఉపాధ్యాయుడు చితకబాదిన సంగ తి తెలిసిందే.
విద్య కోసం పిల్లలను దూరంగా ఉంచుతున్న పెద్దలు
ఇది వరకు లాగా కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న ప్రేమకంటే విద్యపైనే మక్కువ చూపే విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాము ఉన్న ప్రాంతంలోనే పాఠశాలను ఎంచుకొని విద్యను తమ పిల్లల్ని చదివించేవారు, కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు నాణ్యతతో కూడిన విద్య ఎక్కడైతే లభిస్తుందో అక్కడికే పంపడానికి మక్కువ చూపుతున్నారు. ఐఐటీ ఫౌండేషన్, నిట్ కోర్సుని వేరే ప్రాంతంలో ఉంటున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. నగరంలో ఉంటున్నా సరే తీసుకెళ్లి హాస్టళ్లో వేస్తున్నారు. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్నారు.ఈ క్రమంలో పిల్లల మానసిక స్థితిని అటు తల్లిదండ్రులు…ఇటు విద్యా సంస్థల నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల సరైన వసతులు లేని హాస్టళ్లలో పిల్లలు నలిగిపోతున్నారు.
చదువు ఒత్తిడి నుంచి బయటపడేందుకు క్రీడలను మించిన సాధనం లేదంటారు. మనస్తత్వ వేత్తలు అ లాంటిది ఇప్పుడున్న చాలా విద్యా సంస్థల్లో ము ఖ్యంగా పట్టణాలు, నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలే తప్ప ఆట మైదానాలు లేనే లేవు. పిల్లలను గంటల తరబడి పు స్తకాలకు పరిమితం చేయడం మినహా… వేరే వ్యాప కం లేకపోవడంతో వికాసానికి ఆస్కారం కొరవడిం ది. క్రీడలకు ప్రాధానమిచ్చే పాఠశాలల నుండి వచ్చి న విద్యార్థులు… ఇంటర్‌లో తాము చేరిన కళాశాల లో అసలు అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో కొత్త వాతావరణంలో సర్దుకోలేకపోతున్నారు.
ఆసక్తి లేకపోయినా ఒత్తిడిని అనుభవిస్తున్నారు
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలనే అందరూ కోరుకుంటారు. కానీ ఎదుటివారిలా జీవించాలని ఉబలాటపడుతుండడమే స మస్యలను తె చ్చి పెడుతోంది అంటారు సైకాలజిస్టులు. ఎదురింట్లోని విద్యార్థి, చుట్టాలబ్బాయి ఇంటర్ కార్పొరేట్ కళాశాలలో చదివి… ఐఐటీలో చదువు పూర్తి చేసుకొని నెలకు ఆరంకెల వేతన ప్యాకేజీ పొందడంతో… తమ పిల్లాడూ అ లా గే ఎదగాల ని తల్లిదండ్రులు భావిస్తున్నారు. విద్యార్థికీ ఆసక్తి ఉంటే అలాగే చేయవచ్చు.. ఆసక్తి లేకపోయినా ఒత్తిడి చేస్తున్న సందర్భాల్లోనే పిల్లలు చదువును భారంగా భావిస్తున్నారు.
సంక్లిష్టమైన ఆంగ్ల విద్య
ప్రస్తుతం విద్యార్థులు మరో సంక్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నారని విద్యావేత్తలు అంటున్నారు. గ్రామీ ణ ప్రాంతాల పిల్లలు ఎక్కువగా తెలుగు మాధ్యమం నుంచి వస్తున్నారు. వీరు ఇంటర్, ట్రిపుల్ ఐటి, ఐఐటీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలో ఇతరులతో పోటీపడలేక కుంగిపోతున్నారు. ఈ కారణంగా కొందరు కళాశాలల నుండి వెనక్కి తిరిగి వెళ్లిపోగా.. వెళితే అమ్మానాన్న ఏమాంటారో అని బలవన్మరణం పాలైన ఘటనలు ఉన్నాయి.
మనోవేదన పంచుకోలేకపోతున్నారు
విద్యార్థులు తమ మనస్సులోని భావాలను ఒకరితో మరొకరు పంచుకునే పరిస్థితులు లేకపోవడమూ కుంగుబాటుకు దారి తీస్తోంది. కొన్ని విద్యా సంస్థ ల్లో విద్యార్ధి దృష్టి మళ్లే అవకాశముందనే సాకు తో తరచూ చూసేందుకు రావొద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో కొందరు పిల్లలు మనోవేదన కు లోనవుతున్నారు. ధైర్యం చెప్పే వారు లేక.. ఆవేశంలో అర్ధాంతరంగా దూరం అవుతున్నారు.
గుర్తింపు కోసం తల్లిదండ్రుల ఒత్తిడి
ఇంజనీరింగ్ మెడిసిన్ వైపే తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చడానికి వాటికున్న ఉపాధి అవకాశాలే కారణమంటున్నారు సామాజికవేత్తలు. జీవితంలో త్వరగా స్థిరపడవచ్చని… సమాజంలో మంచి పేరు ఉండటం, పెద్ద మొత్తాలు సంపాదించే వీలు వంటివన్నీ తల్లిదండ్రుల్ని ఈ కోర్సుల వైపు బలవంతంగా నెట్టేసాలా చేస్తున్నాయి. మిగతా కోర్సులకి ఉద్యోగాలు త్వరగా దొరక్కపోవడం, దొరికినా వేతనాలు అంతంత మాత్రంగా ఉండటంతో… భవ్యిత్తులో పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఒత్తిడి చేసైనా వారిని ఈ కోర్సుల్లో చేర్పిస్తున్నారు.
పిల్లల విద్య కోసం అప్పుల పాలు
తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ప్రస్తుతం అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సమాజంలో గుర్తింపు కోసం స్థోమత లేకపోయినా అప్పు చేసి మరీ చదివిస్తున్నారు.ఈ ఒత్తిడీ పిల్లలపై పనిచేస్తోందని విద్యావేత్తలు చెబుతున్నారు. లక్షల్లో ఫీజులు చెల్లించాం. ఆ మేరకు ఫలితాలు చూపాలని అమ్మానాన్న మాటలు పిల్లల మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

నేటి సమాజంలో పిల్లలు రాణించాలి
నేటి పోటీతత్వ సమాజంలో తల్లిదండ్రులకు, పిల్లలకు గుర్తింపు రావాలంటే విద్యార్థులు కష్టపడక తప్పదు. అందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులను కూడా ఇంటి వద్ద శ్రమించాల్సి వస్తుంది. వేలల్లో ఫీజులు చెల్లిస్తూ చివరకు విద్యార్థికి విద్యపై పట్టు లేనట్టు కన్పించే సరికి తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది. అందుకు ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో అందరిపై శ్రద్ధ కనబర్చాలి.
                                                                                                                                    -భానోత్ అశ్విని (పేరెంట్,సూర్యాపేట)

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే
ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో డిగ్రీ వరకు కష్టపడి చదువుతున్నా. ఉన్నత చదువుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. మా ఊరిలో నా కంటే సీనియర్స్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నా. నా తోటి విద్యార్థులంతా పోటి పోటీగా ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు.

                                                                                                                                    చెరుకు అశోక్,
                                                                                                            డిగ్రీ విద్యార్థి (గ్రామం వేల్పుచర్ల, మండలం జాజిరెడ్డిగూడెం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News