Friday, March 29, 2024

ఎసిబి వలకు చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

- Advertisement -
- Advertisement -

Deputy Tahsildar

 

హైదరాబాద్ ః నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసులో ఎన్నికల విధులకు సంబంధించిన సి సెక్షన్ ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడింది. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం మారేపల్లిలోని సర్వే నెంబర్ 15లో గల రెండు ఎకరాల వివాద భూమి పట్టా చేస్తానని వెంకటయ్య అనే వ్యక్తిని నమ్మించింది. అందుకు రూ.13 లక్షలు డిమాండ్ చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో బాధిత రైతు వెంకటయ్య నుంచి డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా ఎన్నికల విధులకు సంబంధించిన అధికారిని రెవెన్యూకు సంబంధించిన పని చేసి పెడతానని ఎలా లంచం డిమాండ్ చేసింది, డిప్యూటీ తహసీల్దార్ వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Deputy Tahsildar Arrested by ACB
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News