Home నిజామాబాద్ జాతీయ జెండాకు అవమానం

జాతీయ జెండాకు అవమానం

National-Flag

ఒక గంటలోపే జెండా తొలగింపు

వర్ని: ఎంతో మంది మహానీయుల త్యాగాలు, ప్రాణత్యాగాల ఫలితం భారత దేశానికి స్వతంత్య్రం, 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రస్తుతం 71వ స్వాతంత్య్ర జెండా వేడుకలు ప్రభుత్వాలు ఘనంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇస్తున్నప్పటికి కింది స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల జాతీయ జెండాకు అవమానం జరిగింది. వర్ని మండలంలోని పలు గ్రామాలలో జాతీయ జెండాను మంగళవారం ఘనంగా జరుపుకున్నప్పటికి జలాల్‌పూర్ గ్రామ ఉర్థూ మీడియం పాఠశాల ఎదుట జాతీయ జెండాను సగం వరకు ఎగర వేశారు.

మధ్యాహ్నం సమయంలో పాఠశాల టీచర్ వచ్చి మళ్ళీ జెండాను ఎగుర వేసింది. సైద్‌పూర్ తాండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగర వేసిన గంట సేపటికి జెండాను తొలగించి లోపల పెట్టారు. పక్కనే ఉన్న అంగన్‌వాడీ కార్యాలయంలో సైతం ఈదె దుస్థితి. అంతంపూర్ తాండ గ్రామంలోని అంగన్‌వాడీ కార్యాలయం, లకా్ష్మపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కార్యాలయం, అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను అవమానం చేశారు. సగానికిపైగా జెండ ఎగరవేశారు, తిమ్మాపూర్ గ్రామంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం ఎదుట జెండాను అవమానం చేశారు. మహానీయునియంతో పాటు బాపూజికి కళ్ళ అద్దాల పెట్టడం విస్మరించారు.