Home ఆఫ్ బీట్ షెర్లాక్‌తో వ్యాధుల గుర్తింపు

షెర్లాక్‌తో వ్యాధుల గుర్తింపు

AA

మానవ శరీరంలోని వ్యాధులను గుర్తించడానికి ఓ ప్రత్యేకమైన కాగితాన్ని తయారుచేశారు అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. షెర్లాక్( స్పెసిఫిక్ హైసెన్సిటివిటీ రిపోర్టర్ అన్‌లాకింగ్)గా పిలుస్తున్న ఈ కాగితాన్ని ఆర్‌ఎన్‌ఏ శాంపిల్స్‌లో ముంచడం ద్వారా శరీరంలో ఏయే రోగాలున్నాయో వెంటనే తెలుసుకోవచ్చునని ఎంఐటీకి చెందిన ఫెంగ్ జెహాంగ్ వెల్లడించారు. షెర్లాక్ ద్వారా ట్యూమర్ డీఎన్‌ఏ, ఊపిరితిత్తుల కేన్సర్, డెంగీ వైరస్‌లను గుర్తించగలిగినట్లు తెలిపారు. షెర్లాక్‌లో ప్రధానంగా సీఏఎస్ 13 అనే ఎడిట్ చేసిన ప్రొటీన్ ఉంటుందన్నారు. ఏదైనా శాంపిల్స్‌లోకి సీఎఎస్ 13ను ముంచినప్పుడు అందులోని రోగకారక క్రిముల ఆధారంగా ఈ ప్రొటీన్ ఆర్‌ఎన్‌ఏలుగా విడిపోతుందన్నారు. తద్వారా రోగికి ఏ వ్యాధి సోకిందో వెంటనే తెలుసుకోవచ్చని చెబుతున్నారు.