Home తాజా వార్తలు సర్పంచ్, కార్యదర్శుల నిర్బంధం

సర్పంచ్, కార్యదర్శుల నిర్బంధం

Detention

 

మంథని రూరల్ : పారిశుద్ధ పని చేసిన తమకు కూలీ డబ్బులు చెల్లించాలని మంథని మండలం నాగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లేష్, కార్యదర్శి తిరుపతి, ఉపసర్పంచ్ భాస్కర్‌రెడ్డిలను కార్యాలయంలో తాళం వేసి నిర్బంధించారు. జూన్ నెలలో పారిశుద్ధ పనులు చేసిన 8 మంది కూలీలకు రూ. 50 వేలు చెల్లించాల్సి ఉందని, తమ డబ్బులు చెల్లించే వరకు తాళం తీసేదిలేదని కూలీలు డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న డిఎల్‌పిఒ రాంబాబు నాగారం గ్రామపంచాయతీకి చేరుకొని కూలీలతో మాట్లాడి డబ్బులు చెల్లించటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళన విరమించి కార్యాలయం తాళం తీశారు. 30 రోజుల ప్రణాళిక పనులు చేపట్టడానికి వచ్చిన తమను కూలీలు నిర్బంధించారని, చెక్ పవర్ లేకున్నప్పటికి కూలీలకు రూ. 13 వేలు చెల్లించానని, ఇంకా రూ. 50 వేలు చెల్లించాల్సి ఉందని సర్పంచ్ మల్లేష్ తెలిపారు.

Detentiond of Sarpanch Secretary