Home తాజా వార్తలు ‘దేవదాస్’ ట్రైలర్ వచ్చేసింది..!

‘దేవదాస్’ ట్రైలర్ వచ్చేసింది..!

Devadas Official Trailer out now

హైదరాబాద్: నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న ‘దేవదాస్’  మూవీ ట్రైలర్ ను గురువారం సాయంత్రం జరిగిన ఆడియో విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో నాగ్, నానీ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. దేవ పాత్ర‌లో నాగార్జున‌, దాస్ పాత్ర‌లో నానిలు సరికొత్త వినోదాన్ని అందించ‌నున్నార‌ని ట్రైల‌ర్‌ని చూస్తుంటే తెలుస్తుంది.  వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జునకు జోడీగా ఆకాంక్షసింగ్ నటిస్తుండగా, నానీ సరసన  రష్మిక మందన్న నటిస్తుంది. ఇతర ప్రధాన పాత్రల్లో నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు.

Devadas Official Trailer Released