Wednesday, April 24, 2024

మెగాస్టార్ మూవీలో యంగ్ స్టార్?

- Advertisement -
- Advertisement -

Vijay-Deverakonda

మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా ‘సాహో’ దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో ఈ రీమేక్ రూపొందనుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయిందని.. సాయి మాధవ్ బుర్రా ప్రస్తుతం డైలాగ్ వర్షన్ రెడీ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ‘లూసీఫర్’ సినిమాలో పృథ్వీ రాజ్ పోషించిన కీలక పాత్ర కోసం పలు యంగ్ స్టార్స్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపిస్తోంది. మెగా స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ ఉంటే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. లూసీఫర్ తెలుగు రీమేక్ కోసం చాలా మార్పులు చేర్పులు చేశారు. అందుకే ఈ సినిమాలో ఆ పాత్రను విజయ్ దేవరకొండ చేస్తే బాగుంటుందంటూ ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ యంగ్ స్టార్ ఈ రీమేక్ కు ఓకే చెప్పాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News