Friday, April 19, 2024

దేవరకొండ ఫౌండేషన్‌కు రూ. 2లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

Devarakonda Foundation receives Rs. 2 lakh donation

మనతెలంగాణ/హైదరాబాద్‌: మాతృ దినోత్సవం సందర్భంగా కారోనా భాదితులను ఆదుకునేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు,పట్టబద్రుల జెఎసి రాష్ట్ర సలహాదారులు గొట్టిముక్కల పాండురంగారావు ఆదివారం నాడు దేవరకొండ ఫౌండేషన్‌కు రూ.2లక్షల చెక్కును విరాళం అందించారు. మాతృ దినోత్సవం, హీరో విజయదేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా గొట్టిముక్కల పాండురంగారావు వారి కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ దేవరకొండను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కారోనా బాధితులకు సహాయం అందిస్తున్న విజయ్‌దేవరకొండకు గొట్టిముక్కల పాండురంగారావు తన వంతు సహాయంగా 2లక్షల రూపాయల చెక్కును ‘ది దేవరకొండ ఫౌండేషన్’ సంస్థ పేరుతో బాధితులకు సహాయం అందించారు. ఈ సందర్భంగా హీరో విజయదేవరకొండ మాట్లాడుతూ గొట్టిముక్కల పాండు కుటుంబంతో మా కుటుంబం చాలా సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందని, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కరోనా బాధితులకు రూ. 2లక్షల రూపాయలు నా చేతుల మీదుగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సోదరుడు గొట్టిముక్కల పాండు లాగా ప్రతి ఒక్కరు ప్రజలకు మ సహాయం చేయడానికి ముందుకు రావాలని విజయ్‌దేవరకొండ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News