Home జనగామ దేవరుప్పుల ప్రాంతాన్ని మరో కోనసీమ చేస్తా… మంత్రి ఎర్రబెల్లి

దేవరుప్పుల ప్రాంతాన్ని మరో కోనసీమ చేస్తా… మంత్రి ఎర్రబెల్లి

దేవరుప్పుల : మరో 20 రోజులు ఓపిక పట్టండి… ఆ తరువాత అభివృద్ధిపై దుమ్ము లేపుతా… అని పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు పెర్కొన్నారు. మండలంలోని కొలుకొండ, చిన్నమడూర్, సింగరాజుపల్లి, నీర్మాల, కడవెండి, కామారెడ్డిగూడెం, ధర్మాపురం, మాదాపురం గ్రామాలలో శుక్రవారం పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో తెరాస జోరు కొనసాగుతుందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అన్ని ఎన్నికల్లో ఫలితాలు తెరాస వైపేనని తెలిపారు. మాట తప్పని మహానీయుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని, కెసిఆర్ ముందుచూపుతో చేపట్టిన పథకాలు తెలంగాణ ప్రజలకు వరంగా మారాయన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కాబోతుందన్నారు. వరుస ఎన్నికలతో మూడు నెలలుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అభివృద్ది పనులలో జాప్యం వచ్చిందని, అభివృద్ది పనులు ముందుకు సాగడంలేదన్నారు. మరో నెల రోజుల తరువాత అభివృద్దిని పరుగులు పెట్టిస్తూ దయాకర్‌రావు సత్తా చాటుతానన్నారు. తెరాస ప్రభుత్వం అందిస్తున్న అసరా ఫెన్షన్‌లతో వృద్దుల భరోసా, గౌరవం పెరిగిందన్నారు. వచ్చే నెల నుంచి వృద్దులకు రూ.2016, నిరుద్యోగలకు రూ.3016 గౌరవవేతనం అందించనున్నామని తెలిపారు. రూ.లక్ష రూపాయులు రుణమాఫీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవిదంగా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, 4 ఏళ్ల తెరాస పార్టీ పాలనలో జరిగిన అభివృద్దిని ప్రజలు గుర్తించాలని కోరారు.

ప్రజలంతా సుఖంగా ఉండాలన్నదే సిఎం కెసిఆర్ ద్యేయమని, కెసిఆర్ ఆదర్శ పాలనతో దేశంలోనే తెలంగాణకు గుర్తింపు వచ్చిందన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు టిఆర్‌ఎస్‌తోనే సాద్యమని, కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాత్ర కీలకం కాబోతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసందానం చేయాలని సిఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్దిని అడ్డుకున్నట్లేనని తెలిపారు. రైతుల నుంచి రకరకాల పేరుతో కాంగ్రెస్ పన్నులు వసులుచేసిందని, పెట్టుబడి పేరుతో రైతులకు ఎదురు డబ్బులు ఇచ్చిన ఘనత కెసిఆర్‌దేనని అన్నారు.

మండలంలోని అన్ని గ్రామాలకు కాళేశ్వరం, తుపాకుల గూడెం రిజర్వాయర్‌ల ద్వారా మరో 3నెలలో నీళ్లు అందిస్తానని, 6 నెలల తరువాత 365 రోజులు కాలువల ద్వారా నీరు అందించి ఇక్కడి ప్రాంతాన్ని మరో కోనసీమగా చేస్తానని తెలిపారు. అభివృద్ది చేసే పార్టీ అండగా నిలబడి తెరాస పార్టీ అభ్యర్థులను అత్యధిగా మెజారీటీతో గెలిపించాలని కోరారు.

మహాబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ద్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పేడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి అభ్యర్థి పల్ల భార్గవి సుందర్‌రామిరెడ్డి, ఎంపిటిసి అభ్యర్థులు సుజాత, పద్మ, విజయ్, కళ్యాణి, గిరి, ఉపేందర్, అశాజ్యోతి, రమేష్, పలు గ్రామాల సర్పంచులు, మండల పార్టీ అద్యక్షుడు బస్వ మల్లేష్, నాయకులు జలేందర్‌రెడ్డి, బిక్షపతి, దయాకర్, లాలు, పెద్దారెడ్డి, అర్జున్, మల్లిఖార్జున్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, రవి, రమేష్‌రెడ్డి, నర్సింహారెడ్డి, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Devaruppula area is another Konaseema