Thursday, April 18, 2024

పెద్దపల్లి జిల్లా దేశానికే స్వచ్ఛ దర్పణం

- Advertisement -
- Advertisement -

Devasena

 

స్వచ్ఛ దర్పణ్‌లో జాతీయ స్థాయిలో పెద్దపల్లి జిల్లాకు ప్రథమ స్థానం
అమీర్‌ఖాన్ నుంచి అవార్డు స్వీకరించిన కలెక్టర్ దేవసేన
నారాయణపేట, కామారెడ్డి జిల్లాలకు రెండేసి స్కోచ్ అవార్డులు

హైదరాబాద్:  కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ దర్పన్ అవార్డులలో పెద్దపల్లి జిల్లాకు దేశంలోనే ప్రథమస్థానం లభించింది. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛదర్పన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత అంశంపై నిర్వహించిన వర్క్ షాప్‌లో కలెక్టర్ దేవసేన పాల్గొని పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పానీ సంస్థ(పాని ఫౌండేషన్) అధ్యక్షుడు, సినీ నటుడు అమీర్‌ఖాన్, ఇతర కేంద్ర ఉన్నతాధికారుల సమక్షంలో కలెక్టర్ దేవసేన స్వచ్ఛ దర్పన్ అవార్డు స్వీకరించారు. జిల్లా ఇంఛార్జి గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రప్రకాష్‌రెడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ మేనేజర్ రాఘవులు, స్వశక్తి మహిళా సంఘాల ప్రత్యేక అధికారి ప్రేమ్‌కుమార్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

రాష్ట్రానికి నాలుగు స్కోచ్ అవార్డులు
తెలంగాణకు నాలుగు స్కోచ్ అవార్డులు దక్కాయి. నారాయణపేట, కామారెడ్డి జిల్లాలకు రెండేసి చొప్పున అవార్డులు లభించాయి. నారాయణపేట జిల్లాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు అన్ని కార్యాలయాలను కాగితరహితంగా మార్చేందుకు అమలు చేస్తున్న ఈఆఫీసు ప్రాజెక్టు స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. వర్షపు నీటి నిర్వహణను సమర్థంగా చేపడుతున్నందుకు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్, నీటి పొదుపు ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నందుకు కామారెడ్డి జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలకు చెందిన అధికారులు కూడా స్కోచ్ అవార్డులను స్వీకరించారు.

Devasena who received Swachhudarpan Award
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News