* డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : స్వాతంత్య్రం వచ్చి 69 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎందరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. కానీ రాష్ట్రాభివృద్ధి కోసం ఏ మంత్రి పాటు పడలేదని డి ప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ నియోజకవర్గంలోని దీపం పథకంలో సబ్సిడీ గ్యాస్ సిలెండర్ల పంపిణీ చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను ప్రారంభించా రు. ఈ సందర్భంగా మెదక్ మండలంలోని జానకంపల్లి, మంబోజిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలోనే తెలంగాణ ప్రా ంతం వెనుకబాటు తనానికి గురైందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కావాల్సిన అనేక సం క్షేమ పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టి అవి అమలైయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రం లో ఉన్న అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా సిఎం కెసిఆర్ ప్రణాళికతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. ఎన్నడూ లేని విధం గా నిరంతర విద్యుత్తును అందించడమే కాకుండా మహిళల ఆత్మగౌర వం కొరకు మిషన్‌భగీరథ ద్వారా ఇం టింటికి మంచినీటిని అందించనున్నట్లు తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో సింగూరు నుండి ఇక్కడి ప్రాంతానికి జలాలు తీసుకువచ్చి మాచవరం గుట్టపై బ్యాలె న్స్ రిజర్వాయర్ నిర్మించి గ్రావిటీ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందేవిధంగా చర్యలు చేపడుతామన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా మిగిలిన చెరువులు, కుంటల మరమత్తులను నాలుగవ విడత ద్వారా పూర్తిచేసి వ్యవసాయానికి సరిపడ సాగునీరందించి ఇక్కడి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ఇప్పటికే ఘనపురం ఆయకట్టకు వంద కోట్ల రూపాయలను ప్రభుత్వం మం జూరు చేసిందని, ఆయకట్టు దిగువ బాగాన ఉన్న రైతులందరు తమ హ క్కుగా వ్యవసాయానికి సాగునీరు పొందాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించే వివిధ రకాల పెన్షన్లతో పాటు కళ్యాణలక్ష్మి రూపం లో పేద వారింట్లో జరిగే పెళ్ళి ఖర్చులను అందిస్తుందన్నారు. రానున్న మే నెల నుండి ప్రతి రైతులకు ఎకరానికి 4 వేల చోప్పున పంటసాగు కో సం పెట్టుబడి ప్రభుత్వం అందించనుందన్నారు. ఇప్పటికే రెవెన్యూ సదస్సులో రైతులకు 4వేలు అందించేందుకు సానుకూల నిర్ణయం తీసుకోవ డం జరిగిందన్నారు. భూ ప్రక్షాళనతో 98శాతం సమస్యలు పరిష్కృతమయ్యాయని, కాబట్టి పెట్టుబడి డబ్బులు పాస్‌పుస్తకాలు కలిగిఉన్న రైతుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు జాతీయ రహదారుల మంజూరి కావడంతో మంబోజిపల్లి ప్రాంత వాసులు రోడ్డుకు దూ రంగా తమ నిర్మాణాలను జరుపుకోవాలని సూచించారు. జాతీయ రహదారికి అడ్డంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చిపేయడం జరుగుతుందని, అందుకే ముందుగా ప్రజలు నిర్మించబోయే రోడ్డుకు అడ్డంగా కాకుండా వెనక్కితగ్గి కట్టాలని ఆమె సూచించారు. అంతకుముందు జానకంపల్లి గ్రామ శివారులో నిర్మించబోయే స్మశానవాటిక పనులకు, మంబోజిపల్లికి చేరుకొని 5 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మికిష్టయ్య, జడ్పిటిసి లావణ్యరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు చంద్రమల్ల యాదాగాడ్, గంజి ప్రభాకర్, డిఎస్‌వో రేవతి, తహశీల్దార్ యాదగిరి, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అంజాగౌడ్, కిషన్‌గౌడ్, అరవింద్‌గౌడ్‌లతో పాటు కౌన్సిలర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.