Saturday, March 25, 2023

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

- Advertisement -

cong

*కాంగ్రెస్ హయాంలో అందోల్ అభివృద్ధి
*క్రీడా కళాశాలలను తరలించినా పట్టని టిఆర్‌ఎస్
*పంచాయతీ ఎన్నికల సభలో దామోదర్ రాజనర్సింహా

మన తెలంగాణ/రాయికోడ్ : అందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని, టిఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల కేంద్రమైన రాయికోడ్ పంచాయతీ ఉప ఎన్నిక ఈ నెల 29న జరుగనున్న తరుణంలో శనివారం దామోదర్ రాజనర్సింహా గ్రామంలో పాదయాత్ర నిర్వహించి సభలో ప్రసంగించారు. గ్రామానికి చేరుకున్న దామోదర్ రాజనర్సింహాను గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులతో కలిసి దామోదర్ గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మద్దతు దారురాలైన తాలెల్మ  సరోజనమ్మ (కుట్టు మిషన్ గుర్తు)ను గ్రామస్తులు బలపర్చాలని వినతి చేశారు. మరో ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికల జరగాల్సి ఉన్న తరుణంలో పంచాయతీకి పలు మార్లు సర్పంచ్‌గా ఎన్నికై బాధ్యతలు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందిన బక్కాగౌడ్ కుటుంబానికి అన్ని పార్టీలు బలపర్చి ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యేలా చూడాల్సి ఉండగా టిఆర్‌ఎస్ పార్టీ కుర్చీపై మక్కువతో ఎన్నికలు సై అందని ఆరోపించారు. మండలంలోని అల్లాపూర్ గ్రామ శివారులోని 20 ఎకరాల్లో క్రీడా కళాశాల నిర్మాణానికి తన హయాంలో రూ.13 కోట్లు మంజూరు చేయిస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ కళాశాలలను సిద్దిపేటకు తరలించుకుపోయినా నియోజకవర్గ టిఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యే బాబుమోహన్‌కు పట్టకపోవడం విస్మయాన్ని కల్గిస్తోందన్నారు. బొగ్గులంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి తన హయాంలోనే రూ.20కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. మండల కేంద్రమైన రాయికోడ్ మార్కెట్ యార్డు వచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. కంకోల్ నుంచి రాయికోడ్ చౌరస్తా వరకు రూ.21కోట్లతో 25కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి నిధులు తన హయాంలోనే మంజూరు చేయించానన్నారు. జిల్లాలోని సింగూరు నీరు 10 టిఎంసిల నీరు జిల్లాకే అందాలని పత్రాలు చెబుతుండగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించాలని ప్రభు త్వం యోచించడం సమంజసమా అని ప్రశ్నించారు. రూ.70 కోట్లతో మండలంలోని పాంపాడ్ గ్రామంలో (మహబత్‌పూర్) నిర్మించిన తాగునీటి ప్రాజెక్టును నిర్మించి రాయికోడ్, మునిపల్లి మండలాల ప్రజలకు తా గు నీరు సరఫరా అవుతోందని గుర్తు చేశారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని, సోనియా ఒప్పుకోకుం టే తెలంగాణ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. రాయికోడ్ సర్పంచ్‌గా సరోజనమ్మను ప్రతి ఒక్కరు బలపర్చాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థిని సరోజనమ్మ, ఎంపిపి అధ్యక్షుడు వెంకట్‌రావు, జడ్‌పిటిసి అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మ న్లు కేదార్‌నాథ్, మహాంకాళి, మండల సర్పంచ్‌ల, ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు సతీష్‌కుమార్, శశికాంత్, యువజన కాంగ్రెస్ మండల నాయకులు బాసిత్‌పాటిల్, అంబేడ్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఎస్.విఠల్, నాయకులు రవీందర్, అలీమోద్దిన్, మొగులప్ప, యం లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News