స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
మనతెలంగాణ/శాయంపేట: భూపాలపల్లి నియోజవ ర్గం మూడేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో వాటర్‌ప్లాంట్, నర్సిహులపల్లెలో సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ 1994లో తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో గట్లకానిపర్తి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని 35 ఏళ్లలో ఈ గ్రామానికి కొన్ని వందలసార్లు వచ్చానని గుర్తుచేశారు. గత ఎమ్మెల్యేలు ఎలాం టి అభివృద్ధి చేయలేదని ఈ మూడున్నర ఏళ్ళలో ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. సూరంపేట నుంచి పులకూర్తి వరకు కానిపర్తి నుంచి సర్వపురం రోడ్డును నిర్మించేందుకు ప్రయత్నిస్తానని తెలిపా రు. శాయంపేట మండలాన్ని అన్నిరంగాల్లో ముందుంచే దిశలో పని చేస్తున్నాని అన్నారు. రాజుపల్లి నుంచి మల్లంపల్లి వరకు రూ.2కోట్లతో 4కిలోమీటర్ల వరకు బీటి రోడ్డు మంజూరు చేయ డం జరిగిదని పేర్కొన్నారు. మార్చి తర్వాత వచ్చే బడ్జెట్‌లో తప్పకుండా రోడ్డు వేయిస్తానని హామీనిచ్చారు. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి పను లు చేస్తానని తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న మాదాడి నర్సింహరెడ్డి ఎనాడు గ్రామాల్లో పర్యటించలేదని నేను స్పీకర్‌గా గట్లకానిపర్తి గ్రామానికి 15సార్లు వచ్చానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లో పల్లెల్లో సుడిగాలిలా పర్యటిస్తానని అన్నారు. తహసీల్దార్ వెంకటభాస్కర్, ఆర్‌ఐ హేమనాయక్, ఎంపిపి బాసని రమాదేవి, మాజీ ఎంపిపి బాసని చంద్రప్రకాశ్, సర్పంచ్‌లు వైనాల విజయకుమారస్వామి, ఇమ్మిడిశెట్ట రవీందర్, ఎంపిటీసీ బొమ్మకంటి సుజాత, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కర్రు ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోతు రమణారెడ్డి, టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు వడెపల్లి శ్రీనివాస్, నాయకులు గుర్రం అశోక్, కొమ్ముల శివ, వలిహైదర్, శ్యామ్‌సుదర్‌రెడ్డి పాల్గొన్నారు.