Home ఆదిలాబాద్ విడిపోయాకే తెలంగాణ అభివృద్ధి

విడిపోయాకే తెలంగాణ అభివృద్ధి

బిసి నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో రాయితీలు
మంత్రి జోగు రామన్న
జిల్లాలో మంత్రి పర్యటన
jogu-ramannaఆదిలాబాద్‌రూరల్ : సమైక్య రాష్ట్రం నుండి విడిపోయాకే తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ,బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని వికలాంగుల కాలనీ పరిధిలోని అటెండర్స్ కాలనీలో నూతనంగా ప్రతిష్టించిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ విగ్రహావిష్కరణకు ముక్య అతిధిగా హాజరైన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పట్టణమా, పంచాయతీనా? అనే మీ మాంసతో కొట్టుమిట్టాడుతున్న కాలనీ సమస్యను పరిష్క రించేలా చూస్తానన్న ఆయన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా వెల్లడించారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అటెండర్ కాలనీను ఇకపై జయశంకర్ కాలనీగా నామకరణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.తెలంగాణ సాధన కోసం ఎన్నో రకాల కవితలు వ్రాసి పోరాటాలు చేసి తెలంగాణ రావడానికి ఎంతో త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని అభృవృద్ధికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహుమూద్, అశోక్‌గౌడ్, టిఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దీన్, ఆరె నారాయణ, అడ్డి భోజారెడ్డి, జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు దోనె జ్యోతి,సత్యనారాఁణ, ఎంపిపి శుక్ల తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి
ఎదులాపురం: ఎస్సీ,ఎస్టీల తరహాలో బిసి నిరుద్యోగ యువతకు పరిశ్రమల ద్వారా ప్రత్యేక రాయితీలు అందించేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నట్లు రాష్త్ర అటవీ, పర్యావరణ,బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని శాంతినగర్‌లో తాలూకా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించిన ఆయన సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2016వ సంవత్సరపు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సంఘ భవనం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లారు. బిసిల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎదే నన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్, సంఘం నేతలు జిట్టా రమేష్, కాసర్ల శ్రీనివాస్, మంచికంటి ఆశమ్మ, ఉద్యోగుల సంఘం నేతలు ఆడెపు మహేందర్, శివకుమార్ పాల్గొన్నారు.
యాంత్రీకరణ పథకాలను సద్వినియోగపర్చుకోవాలి
ఆదిలాబాద్ రూరల్: రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జైనథ్ మండల రైతులకు ఆర్‌కేవీవై పథకం కింద మంత్రి జడ్పీ చైర్‌పర్సన్ శోభసత్యనారాయణ గౌడ్, డీసీసీబీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, టిఆర్‌స్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, జైనథ్ మండల టీఆర్‌ఎస్ నాయకులు తల్లెల చంద్రయ్య, లింగారెడ్డి, జేడీఏ కోటేశ్వర్‌రావ్‌తో కలిసి ట్రాక్టర్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.ఆర్‌కేవీవై పథకంలో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా పత్తి రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశలను రైతులు సద్వినియోగపర్చూకోవాలని కోరారు. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్‌పర్సన్ శోభరాణి అన్నారు. తమ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా అదుకునేందుకు పంట రుణాల మాఫిని ప్రవేశ పెట్టిందని ఇప్పటి రెండు విడుతలుగా అమలు పర్చామని రానున్న ఖరీఫ్ సీజన్ సమయనికి మిగిత రెండు విడుతలు ఒకేసారి చెల్లించేందుకు బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.