Home నల్లగొండ హాలియా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

హాలియా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

 Development of the municipality of Haliya

మన తెలంగాణ/ హాలియా: హాలియా మున్సిపాలిటీ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారి స్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హాలియాలో గురు వారం నూతన మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రారంభించి  అనంతరం మాట్లాడుతూ  హా లియాలో డ్రైనేజీల ఏర్పాటు, మెరుగైన పారిశు ద్ధ్యానికి చర్యలు చేపడతానన్నారు. నిత్యం ప్ర జలకు అందుబాటులో ఉంటానని, సూర్యా పేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చా నో అన్ని నిధులు నాగార్జునసాగర్ నియో జక వర్గానికి అందించానని దీనిపై అసెంబ్లీలో కూ డా చర్చకు సిద్దమన్నారు. ప్రజల అభివృద్దే టీఆర్‌ఎస్ పార్టీకి ముఖ్యమని ప్రజల దృష్టిలో ఇతర పార్టీల వారికి -0 మార్కులు వస్తున్నా య ని దీంతో వారి పీటలు కదులు తున్నా య న్నారు. ప్రభుత్వం రాష్ట్రం, జిల్లా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తుందని నియోజక వర్గం ప్రజలు నేటికి మంచినీళ్ల కోసం వినతి పత్రాలను అందిస్తున్నారని దీనిని బట్టి 30 ఏ ళ్లుగా గత పాలకులు చేసినఅ భివృద్ది ఏమి టో అర్థమవుతుందన్నారు.రాజవరం మేజర్ కింద చివరి భూములకు నీరందించిన ఘనత మాదే అన్నారు.

2019 ఎన్నికల్లో కార్యకర్తలు సైని కులుగా పని చేసి టీఆర్‌ఎస్ జెండా ఎగురవే యాలని పిలుపునిచ్చారు. హాలియాలో మరో అభివృద్ది సమావేశంలో కలుస్తానన్నారు. ఇన్‌చార్జ్ నోముల కరెంట్, డ్రైనేజీ సమస్యపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకు ముందు మున్సిపాల్ కార్యాయలం ముందు అంబేద్కర్, బాలు జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూమాలలు వేశారు. పూర్ణకుంభంతో మంత్రికి  ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్‌డీవో జగన్నాధరావు, కమీషనర్ దేశ్యా, స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహాయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్.సి. కోటిరెడ్డి, యడవల్లి విజయేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు  కాకునూరి నారాయణగౌడ్, కుందూరు వెంకట్‌రెడ్డి, అల్లి నాగమణిపెద్దిరాజు, వస్త్రపూరి మల్లీక, జెడ్‌పీటీసీ యడవల్లి నాగమణిసోమశేఖర్, ఎంపీటీసీలు చెరుపల్లి ముత్యాలు, జంగయ్య, గౌని సుధారాణి, జటావత్ లక్ష్మి, నల్లబోతు సైదమ్మవెంకటయ్య, నాయకులు యడవల్లి మహేందర్‌రెడ్డి, ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి శ్రీనివాస్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, కె.వి. రామారావు, రావుల చినబిక్షం, కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి, గార్లపాటి ధనమల్లయ్య,  కూరాకుల వెంకటేశ్వర్లు, బ్రహ్మానందరెడ్డి, రవినాయక్, మట్టారెడ్డి, సత్యం, బ్రహ్మానందరెడ్డి, పెద్దులు, శివయ్య, రాజారమేష్, చెన్ను వెంకట్‌నారాయణరెడ్డి, వెంపటి శ్రీను, తరి రాము,  శ్రీనివాస్‌స్వామి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.