Home నిర్మల్ అభివృద్ధి పథకాలను సకాలంలో పూర్తి చేయాలి

అభివృద్ధి పథకాలను సకాలంలో పూర్తి చేయాలి

lady

రాష్ట్ర గృహానిర్మాణ, న్యాయ,
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న అభివృద్ధి పథకాలను జిల్లాలో సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డబుల్‌బెడ్ రూమ్ ,మిషన్ భగీరథ, మిష న్ కాకతీయ, తెలంగాణకు హరితహారం, ఎస్‌ఆర్‌ఎస్‌పి, పంచాయతీరాజ్.ఆర్ అండ్ బి అర్టీకల్చర్, పశుసంవర్థక, మత్యశాఖ, కళ్యాణల క్ష్మి, షాదీ మూభారక్ తదితర శాఖల పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో సకాంలో పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలన్నారు.నిర్థేశించిన లక్షం మేర కు పథకాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డబుల్‌బెడ్ రూ మ్ పథకం కింద 3వేల 300 ఇళ్ళ మంజూరి కాగా 2626 ఇళ్ళ కు పరిపాలన పరమైన మంజూరి ఇవ్వడం జరిగిందని ఇంకాను 734 ఇళ్ళకు పరిపాలన పరమైన మంజూరి ఇవ్వాల్సి ఉందని అన్నారు.ఇళ్ళ నిర్మాణానికి ఉచితంగా ఇసుక,తక్కువ రేట్‌కు సిమెంట్ సరాఫరా చేస్తున్నామని తెలిపారు.జనవరి 2లోగా టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు.మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 671 గ్రామాలకు త్రాగు నీరు ఇచ్చే పథకంలో ఇప్పటివరకు 205 గ్రామాలకు పైపు లైన్‌లు పూర్తి అయిందని 145 గ్రామాలు ప్రోగ్రేస్ట్‌లో ఉన్నాయని ఆర్‌డబ్లు ఎస్ ఇఇ తెలిపారు. పనులను త్వరగ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.మిషన్ కాకతీయ పథఖం కింద ఫేజ్ 1లో 121 చెరువుల పనులు పూర్తి చూయడం జరిగిందన్నారు.చెరువుల మరమ్మత్తులల్లో 86 చెరువు లు పూర్తి చేయడం జరిగిందన్నారు.34 చెరవులు ప్రగతిలో కలవ ని ఇప్పటివరకు 1752 .57 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని ఫేజ్ 3లో 63 చెరువుల పనులు చేపట్టి 7 పూర్తి చేయ డం జరిగిందని తదితర అంశాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జి ల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి,జెడ్పి చైర్మన్ శోభారాణి,ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి,రేఖానాయక్,జేసి శివలింగయ్య,అసిస్టేంట్ కలెక్టర్ కాంత్రిరెడ్డి,ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్‌రాంకిషన్‌రెడ్డి,ఎఎంసిసారంగాపూర్ రా జ్ హహ్మాద్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌చక్రవర్తి,ఆడెల్లి ఆల య చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.