Home తాజా వార్తలు అభివృద్ధే లక్ష్యంగా

అభివృద్ధే లక్ష్యంగా

wrlవరంగల్: వారం రోజుల పాటు ప్రజల్లో ఉం టూనే వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించేందుకు వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఈ వారం రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మీ కోసం మీ సంక్షేమం కోసమంటూ ఈ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం వాట్సప్, టోల్‌ఫ్రీనెంబర్, వెబ్‌సైట్ ఆవిష్కరించారు. వారం రోజుల పాటు చేపట్టే కార్యచరణను ప్రకటించారు. ఈ మేరకు రూపొందించిన బులిటిన్‌ను సోమవారం హైద రాబాద్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, వైద్యారో గ్యశాఖ మంత్రులు కె తారకరామారావు, డాక్టర్ లకా్ష్మరెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ వినయ్, కొరబోయి న సాంబయ్య, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 100 రోజులు హరితహారాన్ని పండుగలా నిర్వహించనున్న ట్లు వినయ్ ప్రకటించారు.
ప్రజలతో ముఖాముఖి
శుక్రవారం ముఖాముఖి కార్యక్రమంలో భా గంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నెలలో మొదటి శుక్రవారం ప్లానిటోరియం దగ్గర, రెండవవారం హన్మ కొండ మున్సిపల్ వార్డు ఆఫీస్, మూడవవారం నక్కలగుట్ట వాటర్ ట్యాంక్ మున్సిపల్ కార్యాలయం, నాలుగో వారం కాజీపేట మినీ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు.
అడ్డా ములాఖత్
నెలలో మొదటి శనివారం ఉదయం 7నుంచి 9గంటల వరకు ఆటోఅడ్డాలు, హమాలీ, భవ న నిర్మాణ, పండ్ల, కూరగాయలు, చిరువ్యాపా రులు, మార్కెట్‌లలో ఏదో ఒకదాన్ని సంద ర్శించి సమస్యలు తెలుసుకుంటారు.
స్లమ్,కాలనీ దర్శన్
నెలలో మూడవ శనివారం ఉదయం 9గం టల నుంచి 11గంటల వరకు స్లమ్ ఏరియా లో పర్యటిస్తారు. కాలనీ దర్శన్‌లో భాగంగా ఆది వారం ఉదయం 9నుంచి 11గంటలవర కు కాలనీల్లో పర్యటిస్తారు. అపార్ట్‌మెంట్ దర్శ న్‌లో భాగంగా ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నియోజ కవర్గం లోని అపార్ట్‌మెంటలను సందర్శి స్తారు. అధికారుల దృష్టికి తన దృష్టికి వచ్చిన సమస్యలను, ఫిర్యాదు లను సోమ, మంగళ, బుధవారాల్లో అధికా రుల దృష్టికి తెచ్చి పరిష్కరిస్తాను. హైదరాబా ద్ స్థాయి లో ఉంటే అక్కడే పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. గురువారం రోజు పార్టీ కార్య కలాపాల్లో పాల్గొంటానని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర ప్రధాన సంద ర్భాల్లో తప్ప ఈ కార్యక్ర మాలు అమలు చేస్తామన్నారు. వాట్సప్ నెంబర్ 97019 99711, టోల్‌ఫ్రీ నెంబర్ 18004196263, వెబ్‌సైట్ dasyamvinay.comలుగా ఎంఎల్‌ఎ ప్రకటించారు.