Saturday, March 25, 2023

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -

harish2* భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట లోని కోమటి చెరువు సుందరీకరణతో పాటు పట్టణంలోని పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. జరుగుతున్న పనుల్లో అలసత్వంపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో చేసే పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశా లు జారీ చేశారు. మం గళవారం ఉదయం కోమటి చెరువు మినీ ట్యాంక్‌లపై మార్నింగ్ వాక్ చేస్తు చేరువు సుందరీకరణ పనులపై అధికారులతో క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ప్రజలను అబ్బుర పరిచేవిధంగా ఆటవిడుపు కేంద్రంగా మారిందని అన్నారు. పలు చోట్ల పూర్తి కాని పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలిక చైర్మన్ రాజనర్సుకు ఆదేశాలు జారీ చేశారు. ఇరిగేషన్ మున్సిపల్ టూరిజం శాఖ సమన్వయంతో పూర్తి స్థాయిలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం పనులను పరిశీలించారు.హైద్రాబాద్ తర్వాత సిద్దిపేటలోనే అంతగొప్ప స్థాయిలో ఆడిటోరియం ఉండాలన్నారు. హైద్రాబాద్‌లో ని ర్మించిన జాతీయ జెండా కంటే 100 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్న ధ్వజం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మిషన్ భగీరథ పైలాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ సిఈ విజయ్ ప్రకాశ్‌తో ఫోన్‌లో మాట్లా డి పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తనిఖీ చేశారు.
రెసిడెంట్ ఆర్‌ఎంఓపై మంత్రి గుస్సా..: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సరైన సమయానికి ఆర్‌ఎంఓ లేకపోవడంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. అలాగే ఆసుపత్రి పరిసర ప్రాంతాన్ని తనిఖీ చేశారు. అక్కడక్కడ చెత్త ఉండడంతో అధికారులపై మండిపడ్డారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిల్ అరసు, ఆసుపత్రి ఇంజనీరింగ్ విభాగం అధికారి విశ్వప్రసాద్‌లతో చర్చించి పనుల పురోగతిపై ఆరా తీశారు. తిరిగి ఈ నెల 9న పరిశీలనకు వస్తానని మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News