Home తాజా వార్తలు బిజెపిలో చేరనున్న దేవేందర్ గౌడ్ తనయుడు

బిజెపిలో చేరనున్న దేవేందర్ గౌడ్ తనయుడు

Veerender Goudహైదరాబాద్: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి  టి.దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్‌గౌడ్ బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన టిడిపికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన టిడిపి చీఫ్ చంద్రబాబుకు పంపించారు. వీరేందర్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ తెలుగు యువత అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈనెల 3న బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు వీరేందర్ గౌడ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న దేవేందర్ గౌడ్ కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొడుకు వీరేందర్ గౌడ్ తోపాటు తాను కూడా బిజెపిలో చేరాలని దేవేందర్ గౌడ్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Devender Son Veerender Goud Joins BJP