Saturday, April 20, 2024

శర్వానంద్ సినిమాకు దేవిశ్రీ సంగీతం

- Advertisement -
- Advertisement -

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని తెలిసింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News