Home జాతీయ వార్తలు స్థానిక సంస్థలకు అనాదిగా అన్యాయం

స్థానిక సంస్థలకు అనాదిగా అన్యాయం

 

Venkaiah Naidu

 

చట్టం ఉన్నా తీరని కష్టాలు, దక్కని అధికారాలు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శ
రాష్ట్రాలు సహకరిస్తేనే కావల్సిన బలం

ముంబై : దేశంలో స్థానిక సంస్థలకు అధికార వికేంద్రీకరణ అసంతృప్తిగా ఉందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. రాజ్యాంగపరంగా స్థానిక సంస్థలకు సాధికారత కల్పించి 26 ఏండ్లు గడిచాయి. అయితే అమలులో ఇది అసమగ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఓటర్లను చైతన్యపరిచి, వారు ఓటు వేసేలా చేసిన 14 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు అందించే కార్యక్రమం సందర్భంగా శనివారం ఉప రాష్ట్రపతి మాట్లాడారు. ఈ పురస్కారాలను మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలకు అధికారాలను సమగ్ర రీతిలో పం పిణి చేయాల్సి ఉందని తాను పలు సార్లు చెపుతూ వస్తున్నానని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి 3 fల అవసరం ఉంది. సరైన ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీలతోనే సకాలంలో స్థానిక సంస్థలు సరైన రీతిలో పనిచేసేందుకు వీలేర్పడుతుందన్నారు.

ఈ సంస్థలకు నిధులు అవసరం, సరైన విధులు నిర్ధేశితం కావాలి. ఇక అమలుచేసే సిబ్బంది ఉండాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తూ 1993 ఎప్రిల్‌లోనే పార్లమెంట్‌లో చట్టం తీసుకువచ్చారని, ఇందుకు 73వ రాజ్యాంగ సవరణ చేశారని ఉప రాష్ట్రపతి వివరించారు. స్థానిక సంస్థల సాధికారతకు ఈ దశలోనే చట్టబద్ధత ఏర్పడిందని, అయితే ఇప్పటికీ వాటి పరిస్థితి అంతంతగానే ఉందని చెప్పారు. స్థానిక సంస్థలకు సరైన అధికారాల విషయంలో రాష్ట్రాలన్నీ కూడా సరైన విధంగా వ్యవహరించాల్సి ఉంది. సంస్థల పరిధిలోకి కేటాయించిన 29 అంశాలు ఖచ్చితంగా వచ్చేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అయినా అధికార పంపిణీ జరిగితే ఉన్నత స్థాయిలో ఒత్తిడి తగ్గుతుందని సూచించారు.

ఎన్నికలు వాయిదా వేయవద్దు
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్థిష్ట కాలపరిమితి ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి జరగాల్సిందేనని, ఏదో సాకుతో రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వాయిదా వేయకుండా చూడాల్సి ఉందని నాయుడు స్పష్టం చేశారు. ఈ దిశలో ఎన్నికల సంఘానికి గురుతర బాధ్యత ఉందని, ఎట్టి పరిస్థితుల్లో నూ రాజకీయ వ్యవస్థపై, కీలక సంస్థలపై ప్రజల విశ్వా సం చెక్కుచెదరకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం రాజీలేని ధోరణితో వ్యవహరించాల్సి ఉందని చెప్పారు. స్థానిక సంస్థల సక్రమ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి సరైన తోడ్పాటు అందించాల్సి ఉందని సూచించారు. మహారాష్ట్ర సుదీర్ఘ సామాజిక రాజకీయ సంస్కరణల ప్రక్రియను సంతరించుకుని ఉందని కితాబు ఇచ్చారు. ఓటర్లను చైతన్యపర్చేందుకు కృషి చేసిన వారిని గౌరవించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులు ఏర్పాటు చేయ డం అభినందనీయం అన్నారు. పేపర్లు విసిరికొట్టడం ఏం పద్థతి

వారి తీరు బాధించింది
గత రెండేళ్లలో రాజ్యసభలో కొన్ని వర్గాల వ్యవహారశైలి తనను తీవ్రంగా బాధించిందని ఉప రాష్ట్రపతి, ఆ సభాధ్యక్షులు అయిన వెంకయ్యనాయుడు తెలిపారు. కొన్ని బిల్లుల ఆమోదంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. సభ్యులంతా పార్లమెంట్ నిర్వహణలో ఎవరికి వారు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటే సభ సమర్థవంతంగా సాగుతుందని చెప్పారు.

రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న తనకు కొన్ని పరిణామాలతో తాను ఆవేదనకు గురి అయినట్లు, కొందరు సభ్యులు నిబంధనలు, సాంప్రదాయాలను, ప్రవర్తనా నియమావళిని పట్టించుకోకుండా ఉండటంతో సభలో గందరగోళానికి కారకులు అవుతున్నారని, ఇటువంటి చర్యలతోనే సభా స్థాయి గౌరవ మర్యాదలు ప్రజల దృష్టిలో తగ్గిపోతాయని అన్నారు. ప్రస్తుత సెషన్‌లోనే కొందరు సభ్యులు అధికారిక పత్రాలను చింపివేసి సభాధ్యక్షుడి వైపు విసిరికొట్టడం వంటి ఘటనలు జరిగాయని, ఇది మన పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రక్రియకు మంచిదా? అని ఆయన ప్రశ్నించారు. దిగువసభలో ఒక సభ్యుడి అనుచిత వ్యాఖ్యలపై ఇతర పార్టీల సభ్యులంతాసముచితంగా నిరసన తెలిపారని అన్నారు. మహిళను అగౌరపరిచే వ్యవహారం ఎక్కడైనా ఆమోదయోగ్యం కాదని ఆజంఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో వెంకయ్య నాయుడు తెలిపారు.

Devolution of powers to local bodies still not satisfactory