Home జాతీయ వార్తలు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

Devotees Crowd Common At Tirumala Srivari Templeతిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం శ్రీవారిని 30,442 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. 10,867 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీకి రూ.2.4 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.