Home Default తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Crowd In Tirumala Srivari Templeతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 27,544 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం శ్రీవారికి 14,368 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ 2.50 కోట్ల ఆదాయం వచ్చింది. మంగళవారం శ్రీవారిని  స్వామి పరిపూర్ణానంద స్వామి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి పరిపూర్ణానంద స్వామి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయకుండా టిటిడి పాలకమండలి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.