Home Default వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Crowd In Vemulawada Rajanna Templeరాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో  స్వామి వారిని దర్శించుకునేందుకు  భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు చేశారు. భక్తుల రద్దీని పురస్కరించుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.