Home Default తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Tirumala Templeతిరుమల : తిరుమల శ్రీవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ వెలుపల 3 కిలోమీటర్ల మేర లేపాక్షి కూడలి వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. శనివారం  శ్రీవారిని  95,016 మంది భక్తులు దర్శించుకున్నారు. 60,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం  శ్రీవారి హుండీకి  రూ. 2.56 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.

Devotees Rush at Tirumala Temple on Sunday