Home జాతీయ వార్తలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం

తిరుమలకు పోటెత్తిన భక్తజనం

TIRUMALAతిరుపతి: వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్నీ కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 96,779 మంది భక్తులు దర్శించుకున్నారు.