Home తాజా వార్తలు మానవత్వానికి మరో పేరు టిఎస్ జెన్ కో సిఎండి దేవులపల్లి

మానవత్వానికి మరో పేరు టిఎస్ జెన్ కో సిఎండి దేవులపల్లి

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం మల్లారెడ్డి గూడెం గ్రామములో తల్లిదండ్రులను కోల్పోయిన రాజేశ్వరి, శివ చిన్నారులకు ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో పిల్లలు నివసించడానికి ఇల్లు లేదని తెలుసుకున్న టిఎస్ జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అన్ని హంగులతో నూతన గృహం నిర్మించారు. గురువారం చిన్నారులు, విద్యుత్ అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి తో గృహ ప్రవేశం చేశారు. తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అంజయ్య మాట్లాడారు. చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఈ చిన్నారులు నివసించడానికి ఇళ్లు లేదని తెలుసుకున్న వెంటనే ప్రభాకర్ రావు వారికి సాయం చేయాలని తెలిపారు. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే వారికి నూతన గృహం కట్టించడం జరిగింది.

మున్ముందు అ చిన్నారులకు కావాల్సిన సహాయం అందుతుందని, చదువు విషయంలో మా విద్యుత్ ఉద్యోగుల సంస్థ వారికి తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంటితో పాటు వారికి ఒక ఆరు నెలలకి సరిపడు నిత్యావసర సరుకులు కూడా అందిస్తామని తెలిపారు. మా తో పాటు చాలా మంది వ్యక్తులు వారికి తోచిన సాయం చేస్తున్నందుకు వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిన్నారులు మాట్లాడుతూ తాము ఉండడానికి నూతన ఇంటి నిర్మాణం చేసి ఇచ్చినందుకు సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, అంజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇంటి కలను సాకారం చేసిన ప్రభాకర్ రావు సారు జీవితాంతం సల్లగా ఉండాలని చిన్నారులు దీవించారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఈ శివ శంకర్, సర్పంచ్ కొండ పద్మ శ్రీను, ఎంపిటిసి నరి పావని నరసింహ, విద్యుత్ శాఖ అధికారులు చుక్క గిరి, బోయ మల్లేష్, వీశాల, వెంకన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు