Home తాజా వార్తలు ‘డ్రగ్స్’ వ్యవహారంపై డిజిపి సమీక్ష

‘డ్రగ్స్’ వ్యవహారంపై డిజిపి సమీక్ష

DGP mahender reddy meeting with police officials on drugs control

 

డోపమ్ యాప్‌తో క్రయవిక్రయాలకు చెక్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై డిజిపి మహేందర్‌రెడ్డి పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సిపిలతో పాటు డిజిలు, ఎస్‌పిలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా సమీక్షలో డ్రగ్స్ విక్రయదారులు, వినియోగదారుల చిట్టాతో పాటు గతంలో డ్రగ్స్ తీసుకున్నవారి పేర్లతో చిట్టాను పోలీసులు రూపొందించారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు సంబంధించిన చిట్టాలో గంజాయి తీసుకున్నవారి వివరాలనూ పోలీస్‌శాఖ పొందుపర్చింది. డ్రగ్స్‌కు సంబంధించి గత పదేళ్ల డేటాను పోలీస్ శాఖ తయారు చేసింది. డ్రగ్స్ క్రయ,విక్రయాలపై నిఘాకు డోపమ్ యాప్‌ను పోలీసులు రూపొందించారు. అదేవిధంగా డ్రగ్స్ నిరోధంపై అంతర్గత సమావేశంలో చర్చించిన అనంతరం రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, వినియోగంపై సిఎంకు డిజిపి పోలీస్ శాఖ తరఫున నివేదిక అందించనున్నారు.

సిఎం కెసిఆర్ ఆదేశాలతో గతంలోనే ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో క్వింటాళ్ల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 246 కేసులు నమోదు చేసి 2వేల కిలోల గంజాయి, 34 గ్రాముల కొకైన్, 41 గ్రాముల ఎండిఎంఎను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో 602మందిని అరెస్టు చేయగా వీళ్లలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియన్లతోపాటు తరచూ గంజాయి విక్రయిస్తున్న 62మందిపై కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ 93 కేసులు నమోదు చేసి 175మందిని అరెస్ట్ చేశారు. అలాగే 5,700కిలోల గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయించే వాళ్లపై కేసు లు నమోదు చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

DGP mahender reddy meeting with police officials on drugs control