Saturday, April 20, 2024

రాష్ట్రవ్యాప్తంగా 209 ఉత్తమ పోలీసులకు డిజిపి ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

DGP praises 209 best policemen across the state

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 209 మంది ఫంక్షనల్ వర్టికల్ పోలీస్ అధికారులకు మంగళవారం నాడు డిజిపి డాక్టర్ మహేందర్‌రెడ్డి ప్రశంస పత్రాలను బహుకరించారు. నగరంలోని డిజిపి కార్యాలయం నుంచి ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు, టెక్నాలజీ ఉపయోగించడంపై డిజిపి మహేందర్‌రెడ్డి, సిఐడి ఎడిజిపి గోవింద్ సింగ్‌లు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుండి అక్టిబర్ వరకు ప్రతి పోలీస్ యూనిట్‌లో ఫంక్షనల్ వర్టికల్‌లో సాధించిన పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పోలీసు శాఖలోని ప్రతి స్థాయిలో ఫంక్షనల్ వర్టికల్ అధికారుల పనితీరును సాంకేతికంగా విశ్లేషించి, గణంకాలలో మార్చి గ్రేడింగ్ ఇవ్వడంతో పాటు ప్రోత్సహించడం వల్ల మొత్తం పోలీసుశాఖను మెరుగపర్చవచ్చని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప పోలీసు సేవలు అందించడం వల్ల ప్రజలకు నిత్యం అందుబాటు ఉంటూ ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డిజిపి తెలియజేశారు. ఫంక్షనల్ వర్టికల్ విధానం ద్వారా ప్రతి పోలీస్ అధికారి, తన విధుల పట్ల సాధించాల్సిన ఫలితాల పట్ల స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్ర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రతి పోలీస్ అధికారి ప్రతిభను నిర్ధేశించడానికి రూపొందించిన ‘కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్’తో పాటు సాంకేతిక కొలమానాల ద్వారా పనితీరును విశ్లేషిస్తున్నామన్నారు. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 209మంది వివిధ స్థాయిలలోని పోలీసు అధికారులకు(రిసెష్పన్, స్టేషన్ రైటర్, బ్లూకోల్ట్, పెట్రోల్ కారు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్స్, ఎస్‌హెచ్‌వొ, ట్రాఫిక్) డిజిపి ప్రశంసాపత్రాలతో ఏకకాలంలో సత్కరించామని వివరించారు. కార్యక్రమంలో ఎడిజిపి జితేందర్, నార్త్‌జోన్ ఐజిపి వై.నాగిరెడ్డి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News