Monday, June 23, 2025

కొడుకు కోసం కలిసిన ఐశ్వర్య, ధనుష్.. ఫోటో వైరల్

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్‌కి (Dhanush).. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకి(Aishwarya) గత ఏడాది విడాకులు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉంటున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు ఉణ్నారు. పరస్సన అంగీకారంతో విడాకుడలు తీసుకుంటున్నట్లు ధనుష . ఐశ్వర్యలు 2022లో ప్రకటించారు. అయితే తాజాగా వీరిద్దరు కలుసుకున్నారు. అది కూడా వాళ్ల కొడుకు కోసం. తమ తనయుడు యాత్ర గ్రాడ్యూయేషన్ డేలో వీరిద్దరు పాల్గొన్నారు.

కొడుకును ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘యాత్ర పేరెంట్స్‌గా ఎంతో గర్వంగా ఉంది’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. మీ ఇద్దరిని ఇలా చూడటం సంతోషంగా ఉంది అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫోటోని రజనీకాంత్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా ప్రియమైన మనవడు తొలి మైలురాయిని చేరుకున్నాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా’ అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News