Friday, March 29, 2024

ధరణి పోర్టల్ పనితీరు బాగుంది

- Advertisement -
- Advertisement -
AP Registration officials praise Telangana government
తెలంగాణ ప్రభుత్వంపై ఎపి రిజిస్ట్రేషన్ అధికారుల బృందం ప్రశంసలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ భూముల ధరణి పోర్టల్ పనితీరు బాగుందని ఎపి రిజిస్ట్రేషన్ అధికారుల బృందం ప్రశంసించింది. రెండురోజుల క్రితం జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎపి అధికారుల సందర్శించారు. కర్నూల్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్ కిరణ్‌కుమార్ నేతృత్వంలో నలుగురు రిజిస్ట్రార్లు ధరణి పోర్టల్ పనితీరు, రిజిస్ట్రేషన్లు చేసే విధానం, ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, డిజిటల్ పట్టాదారు పుస్తకం పంపిణీ, రికార్డుల నిర్వహణ వంటి వాటిని తహసీల్దార్,జాయింట్ సబ్ రిజిస్ట్రార్ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ధరణి పోర్టల్‌తో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అభినందించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు. ఎపి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ధరణి పోర్టల్‌పై సమగ్రమైన సమాచారం సేకరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Dharani portal performance is good says AP officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News